English | Telugu

వరుణ్ రాయబారికి ఏమైంది..?

కంచెలో సైనికుడిగా ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్. ఆ సినిమా వరుణ్ కెరీర్ కు ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు. అందుకే, తన కెరీర్ లోనే మర్చిపోలేని హిట్ ఇచ్చిన క్రిష్ తో మరో సినిమా ప్లాన్ చేశాడు. రాయబారి అని పేరు కూడా నిర్ణయించుకున్న ఆ సినిమాలో, వరుణ్ ది ఒక గూఢచారి పాత్ర. ఈ ప్రాజెక్ట్ ను తన డ్రీమ్ ప్రాజెక్ట్ రేంజ్ లో భావించాడు క్రిష్. కొన్ని రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు రాయబారికి రెస్ట్ ఇవ్వాలని క్రిష్ ఫిక్సయ్యాడని సమాచారం.

సినిమా స్టోరీకి తగ్గట్టు, మెజారిటీ షూటింగ్ ఫారిన్ లోనే జరగాలి. కానీ తాము వేసుకున్న బడ్జెట్ కు ఈ స్టోరీ లైన్ చాలా భారీగా ఖర్చవుతుందని సిట్టింగ్స్ లో అర్ధం కావడంతో, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టాలని క్రిష్ అనుకుంటున్నాడట. తను అనుకున్నంత భారీగా ఈ సినిమాను తెరకెక్కించడం కుదరదని అర్ధమవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతానికి పక్కన పెట్టినా, ఏదో ఒక రోజు మాత్రం రాయబారిని తెరమీదకు తీసుకొస్తానని క్రిష్ అంటున్నాడట. దీనికి వరుణ్ కూడా ఓకే. ప్రస్తుతానికి వరుణ్ దిల్ రాజు నిర్మాణంలో రచయిత వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా మొదలెట్టబోతున్నాడు. క్రిష్ కు కూడా వరసగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి వీరిద్దరికీ ఖాళీ కూడా లేదు. ఇద్దరికి కుదిరి , సరైన ప్రొడ్యూసర్ దొరగ్గానే రాయబారి మళ్లీ పట్టాలెక్కే అవకాశం లేకపోలేదు. మరి క్రిష్ ఏం చేస్తాడో చూద్దాం..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.