English | Telugu

'అఖండ-2' ఓటీటీ డీల్ లో బిగ్ ట్విస్ట్.. రిలీజ్ కి ముందే 250 కోట్లు..!

ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ సినిమాలలో 'అఖండ-2' ఒకటి. 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. పైగా 'అఖండ'కి సీక్వెల్ కూడా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన 'అఖండ-2'.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా వాయిదా పడింది. డిసెంబర్ లేదా జనవరిలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఎప్పుడు విడుదలైనా.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని.. అభిమానులతో పాటు ట్రేడ్ పండితులు కూడా నమ్ముతున్నారు. (Akhanda 2 Thandavam)

తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా మెచ్చేలా.. 'అఖండ-2' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్న హైప్ దృష్ట్యా.. మేకర్స్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా.. వీలైనంత గ్రాండ్ గా సినిమాని మలిచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే.. మేకర్స్ కి భారీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా 'అఖండ-2' ఓటీటీ రైట్స్ ని ఏకంగా రూ.85 కోట్లకు జియో హాట్ స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. (Akhanda 2 OTT)

నిజానికి 'అఖండ-2' ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా జియో హాట్ స్టార్ తెరపైకి వచ్చింది. ఆ రెండు సంస్థలకు షాకిస్తూ.. అఖండ-2 మేకర్స్ తో రూ.85 కోట్లకు డీల్ క్లోజ్ చేసుకున్నట్లు సమాచారం.

కొంతకాలంగా ఓటీటీ బిజినెస్ కూడా తగ్గిపోయిందని పలువురు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు సిద్ధమైన కొన్ని సినిమాలు.. ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వక, ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కొన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కూడా.. తమ బడ్జెట్ కి తగ్గ సరైన ఓటీటీ డీల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి సమయంలో 85 కోట్ల ఓటీటీ డీల్ తో 'అఖండ-2' అందరినీ సర్ ప్రైజ్ చేసిందని చెప్పవచ్చు.

ఓటీటీ డీల్ తో రూ.85 కోట్లు రాబట్టిన అఖండ-2.. ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ రూపంలో మరో రూ.35-40 కోట్లు రాబట్టే అవకాశముంది. అంటే నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.125 కోట్లు దాకా వస్తాయన్నమాట. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా రూ.120-130 కోట్ల దాకా జరగవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. అంటే 'అఖండ-2' మూవీ టోటల్ గా రూ.250 కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బాలకృష్ణ కెరీర్ లోనే రికార్డు బిజినెస్ కావడం విశేషం. రిలీజ్ కి ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న 'అఖండ-2'.. రిలీజ్ తర్వాత ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...