English | Telugu

ఇక తను లేకుండా సినిమా చెయ్యను.. లోకేష్ కనగరాజ్ నిర్ణయం కరెక్టేనా! 

దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)గత నెల 14 న 'కూలీ'(Coolie)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జనరల్ గా 'రజనీకాంత్'(Rajinikanth)నుంచి సినిమా వస్తుందంటే, దర్శకుడు గురించి పెద్దగా ఆలోచించరు. కానీ లోకేష్ కనగరాజ్ కోసం కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు కూలీకి పోటెత్తారు. దీన్ని బట్టి బాక్స్ ఆఫీస్ వద్ద 'లోకేష్ కనగరాజ్' కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'నా సినిమాలకి అనిరుధ్(Anirudh Ravichander)ప్లస్ పాయింట్. తను లేకుండా నేను సినిమాలు చేయలేను. ఒకవేళ తను రిటైర్ అయితే 'ఏఐ' మీద ఆధారపడతానేమో గానీ, మరొకరితో వర్క్ చేయలేను. కానీ దానికి చాలా టైమ్ ఉంది. సక్సెస్ అంటే బాక్సాఫీస్ దగ్గర .కోట్లు రావడం కాదు. ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా అందించడమే. బాక్సాఫీస్ అనేది కేవలం ప్రొడ్యూసర్ కోసమే. ఒక దర్శకుడిగా పనిపట్ల ఎంత సిన్సియర్‌గా ఉన్నామన్నదే ముఖ్యమని చెప్పుకొచ్చాడు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మా నగరం' మూవీ తప్పించి, ఆ తర్వాత చిత్రాలైన 'ఖైదీ , మాస్టర్, విక్రమ్, లియో, కూలీ వంటి చిత్రాలకి అనిరుద్ నే మ్యూజిక్ అని అందించాడు. ఈ చిత్రాలన్నీ ప్రేక్షకుల్లోకి మరింతగా వెళ్ళడానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో హెల్ప్ అయ్యింది. హీరోల క్యారక్టరేజేషన్ కి సంబంధించిన బిజిఎం అయితే సినిమా రేంజ్ ని కూడా మార్చిందని చెప్పవచ్చు. ఇక కూలీ బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ వచ్చినా, 500 కోట్ల మేర కలెక్షన్స్ ని రాబట్టింది. లోకేష్ ప్రస్తుతం 'ఖైదీ'(Khaidi)కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఖైదీ పార్ట్ 2(Khaidi Part 2)కి సంబంధించిన పనుల్లో ఉన్నాడు. హీరోగాను ఒక సినిమా చెయ్యబోతున్నాడనే టాక్ ఉంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.