English | Telugu
బాలయ్య టీమ్ లో యువరాజ్
Updated : May 19, 2015
నందమూరి బాలకృష్ణ సినిమాల్లో సింహమైతే... మైదానంలో గర్జించే క్రికెటర్.. యువరాజ్. వీళ్లిద్దరూ కలుసుకొన్నారు. బాలయ్యకూ, యువరాజ్‌కీ లింకేంటంటారా?? ఈ కలయిక వెనుక మంచి ప్రయత్నమే ఉంది. కేన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి యువరాజ్ ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. యువీ కెన్ అనే పేరుతో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మరోవైపు బాలకృష్ణ కూడా బసవతారకం కాన్సర్ ఆసుపత్రి ద్వారా కేన్సర్ బాధితులను ఆదుకొంటున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ చేయి చేయి కలిపి కేన్సర్‌పై ప్రజలలో మరింత అవగాహన కల్పించడానికి ముందడుగు వేయబోతున్నారు. అంతేకాదు.. కేన్సర్ పీడుతుల్ని ఆదుకొనేందుకు ఫండ్ కూడా సేకరించే పనిలో ఉన్నారు. అందుకే ఇటీవల యువరాజ్ సింగ్ బాలయ్యని కలుసుకొని.. కార్యాచరణ గురించి మాట్లాడుకొన్నారు. త్వరలోనే బాలయ్య, యువరాజ్ ఒకే వేదికపైకొచ్చి కలసికట్టుగా పనిచేయబోతున్నారు. అదీ సంగతి.