English | Telugu

బిర్యానీతో ఫ్లాట్ చేసిన ప్ర‌భాస్‌

ప్ర‌భాస్‌ని అంద‌రూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. మ‌న హీరోలే కాదు... త‌మిళ తంబీల‌కూ త‌ను డార్లింగే. త‌మిళ స్టార్ క‌థానాయ‌కుడు సూర్య‌కీ ప్ర‌భాస్ అంటే విప‌రీత‌మైన అభిమానం. ఇద్ద‌రి మ‌ధ్యా చాలా కాలం నుంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ స్నేహంతోనే సూర్య సినిమా రాక్ష‌సుడు ఆడియో వేడుక‌కు ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. అతిథి అంటే గుర్తొచ్చింది.. అతిథి మ‌ర్యాద‌ల విష‌యంలో ప్ర‌భాస్ రూటే సెప‌రేటు. భీమ‌వ‌రం బ్యాచీ క‌దా.. ఆ విష‌యంలో ఏమాత్రం లోటు చేయడు. సూర్య‌కీ త‌న అతిథి మ‌ర్యాద‌ల్ని చూపించాడు ప్ర‌భాస్‌. ఓసారి ఇద్ద‌రి షూటింగ్ ప‌క్క ప‌క్క‌నే జ‌రుగుతోంద‌ట‌. ఆ స‌మ‌యంలో రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ సూర్య కోసం ప్ర‌భాస్ ఎదురుచూస్తూ కూర్చున్నాడ‌ట‌. లేట్ నైట్ సూర్య షూటింగ్ ఫినిష్ చేసుకొని రాగానే.. ఇంటి నుంచి తీసుకొచ్చిన మిక్స్‌డ్ బిర్యానీ వేడి వేడిగా వ‌డ్డించాడ‌ట‌. ఆ టేస్ట్‌కి సూర్య ఫ్లాటైపోయాడ‌ట‌. ప్ర‌భాస్ ఆరోజు ప్రేమ‌తో వ‌డ్డించిన బిరియానీ రుచి ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేక‌పోతున్నా అంటున్నాడు సూర్య‌. అలా ఓ బిరియానీ వ‌ల్ల వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డిపోయింద‌న్న‌మాట‌.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.