English | Telugu

2015లో అయినా నిర్మాతలు బాగుండాలి!!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరో సినిమా చూసిన భారీ బడ్జెట్ తో వుంటుంది. యంగ్ హీరోలైన సరే ఒక్క సినిమా హిట్టైతే తరువాత సినిమా రెండింతల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారు. మరి ఇంత బడ్జెట్ పెట్టిన సినిమా కచ్చితంగా హిట్ అవుతుందా.. అంటే చెప్పడం కష్టం! ఒక్కప్పుడు దర్శకనిర్మాతలు మొదట సినిమా స్టోరీని రెడీ చేసుకొని చివరకు హీరోహీరోయిన్ల సెలక్షన్ చేసేవారు. ఆ స్ర్కీప్టుకు అనుగుణంగానే హీరోగాని ఇతర నటులు గానీ నటించాల్సి ఉంటుంది. దీనిలో దర్శకుడే కింగ్ మేకర్. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హీరో కోసమే దర్శకులు స్ర్కీప్టు రెడీ చేసుకుంటున్నారు. దానిలోనూ సినిమా బడ్జెట్ రూ.40కోట్లకు తగ్గకుండా ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ లో సగం వరకు హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్ కే వెళ్తుండడం విశేషం. దీంతో భారీ ఖర్చు పెట్టి సినిమా తీస్తే, అది కాస్త థియేటర్లలో మొదటి రోజే బోల్తా కొట్టి నిర్మాతలను నట్టెట్ట ముంచుతున్నాయి. ఇలాంటి సినిమాలు 2014 సంవత్సరంలో అధికంగానే వచ్చాయి. అయితే వాటి వాళ్ళ హీరోలకు మాత్రం ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే వారికి చేరాల్సిన రెమ్యూనరేషన్ ముందే చేరుతుంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధంతో లేకుండా దర్శకుడితో సహా అందరి వాటా చేరుతుంది. ఒక్క నిర్మాతకి తప్ప.

ఇందులో మిగతా వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన నిర్మాతలు స్టార్ హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుంటున్నారు తప్ప, కథ, కొత్తదనం, వైవిధ్యం పైన దృష్టి పెట్టడంలేదు. అయితే సినిమాలు తీసేది కేవలం హీరోల ఇమేజ్ కోసమేనా? అని సినీ విశ్లేషకులు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న వారు పట్టించుకోవడం లేదు. దీంతో నిర్మాతలకు సంవత్సరాలు గడిచేకొద్ది కష్టాలు పెరుతున్నాయే తప్ప తగ్గడంలేదు. సో ఇప్పటికైన నిర్మాతలు తమ పాత ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పలికి, కొత్త సంవత్సరంలో సినీ ప్రేక్షకులకు మంచి కథ, కొత్తదనం, కాసింత మెసేజ్ ను అందించే సినిమాలు తీసి వాళ్ళు లాభాల బాటలో నడిచే ట్రెండ్ ని తీసుకురావాలని కోరుకుందాం.