English | Telugu
అంజలికి షాకిచ్చిన స్వాతి
Updated : Dec 29, 2014
ఈ యేడాది అంజలి హీరోయిన్ గా వచ్చిన గీతాంజలి సినిమా అనుహ్యంగా విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నటించే చాన్స్ స్వాతికి దక్కినట్లు సమాచారం. నిజానికి స్వాతికి అవకాశం దక్కింది అనే కన్నా, అంజలి మంచి చాన్స్ పొగొట్టుకుంది అనడం బెటర్. ఎందుకంటే ఈ చాన్స్ అంజలిదే. పారితోషికం దగ్గర ఆమె పట్టుపట్టడంతో దర్శకులు ఆమె స్థానంలో స్వాతిని తీసుకున్నారు. స్వాతి కూడా చలాకీ నటిగా ప్రూవ్ చేసుకుంది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ, లైవ్ లో వుంటూ వస్తోంది. అందుకే స్వాతి బెస్ట్ ఆప్షన్ అని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.