English | Telugu
బాలయ్య 99వ సినిమా ఫిక్స్
Updated : Dec 29, 2014
లెజెండ్‌తో ఫుల్ ఫామ్ లోకి వచ్చారు నందమూరి బాలకృష్ణ. ఇది ఆయన 98వ సినిమా. మరో సినిమా పూర్తి చేస్తే సెంచరీ ముంగిట నిలుస్తారు. ఆ సినిమా ఎలాగూ రాజమౌళితోనే అని నందమూరి కాంపౌండ్ నుంచి అందిన వార్త. ఈలోగా బాహుబలి కూడా పూర్తవుతుంది. మరి 99వ సినిమా ఎవరితో చేస్తారన్న ఆసక్తికరమైన చర్చ నెలకొంది. ఈ సినిమా ఇప్పుడు శ్రీవాస్ చేతికి చిక్కింది. లౌక్యం సినిమాతో 2014లో ఓ హిట్ అందుకొన్నాడు శ్రీవాస్. ఆ వెంటనే బాలయ్య నుంచి పిలుపొచ్చింది. శ్రీవాస్ ఇప్పుడు బాలయ్య కోసం ఓ లైన్ సిద్ధం చేశాడు. కోన వెంకట్, గోపీమోహన్ బృందం ఇప్పుడు ఆ లైన్‌ని డెవలెప్ చేస్తోంది. 2015 ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుందని సమాచారమ్.