English | Telugu

ప్రేమికుల రోజుకి మ‌రో స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌

ఎవ‌డ్రా మ‌న‌ల్ని ఆపేది అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీడు చూపిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో స్టార్ హీరోల బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను 4 కె రెజ‌ల్యూష‌న్‌లోకి మార్చి రీ రిలీజ్‌లు చేస్తున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్‌. అభిమాన హీరో సినిమా కొత్త ఫీల్‌, ఫ్రెష్‌గా అనిపిస్తుండ‌టంతో ప్రేక్ష‌కులు కూడా రీ రిలీజ్‌ల‌ను చూడ‌టానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీ రిలీజ్ సినిమాలు సాధించిన వ‌సూళ్ల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెంబ‌ర్ వ‌న్ పోజిష‌న్‌లో ఉన్నారు. రీసెంట్‌గా రిలీజైన ఖుషి రూ.1.63 కోట్లు సాధించి మొద‌టి స్థానంలో నిలిచింది. దాని త‌ర్వాత స్థానం కూడా ప‌వ‌న్ న‌టించిన జ‌ల్సా సినిమానే ద‌క్కించుకుంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ రిలీజ్‌ల‌కు థియేట‌ర్స్ వ‌ద్ద ప‌వ‌న్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఖుషి రీ రిలీజ్ ఇచ్చిన స‌క్సెస్ కిక్ ఇన్‌స్పిరేష‌న్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌టానికి రెడీ అవుతున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో క్లాసిక్ మూవీస్ స‌ర‌స‌న నిలిచే చిత్రం తొలిప్రేమ‌. ఇది ప్యూర్ ల‌వ్ స్టోరి. యూత్‌ను ప‌వ‌న్‌కు ద‌గ్గ‌ర చేసిన చిత్రం ఇది. ఫిబ్ర‌వ‌రి 14న వాలెంటైన్స్ డే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ తొలిప్రేమ చిత్రాన్ని 4కె రెజ‌ల్యూష‌న్‌లో రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా రావొచ్చున‌ని అంటున్నాయి మీడియా వ‌ర్గాలు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, కీర్తి రెడ్డి జంట‌గా న‌టించిన తొలి ప్రేమ సినిమాకు క‌రుణా క‌ర‌న్ ద‌ర్శ‌కుడు. హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను నెక్ట్స్ రేంజ్‌కు చేర్చిన సినిమా ఇది.