English | Telugu
సమంత 'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
Updated : Jan 2, 2023
సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. గతేడాది నవంబర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని 3డి లో విడుదల చేయాలన్న ఉద్దేశంతో వాయిదా వేశారు. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.
'శాకుంతలం' సినిమాతో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నారు డైరెక్టర్ గుణశేఖర్. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళీ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని 2023, ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ ను వదిలారు. శకుంతల, దుష్యంతులు తమ చుట్టూ ఉన్న లోకాన్ని మరిచి, శ్వాస తగిలే అంత దగ్గరగా నిల్చొని, ప్రేమ మైకంలో మునిగిపోయినట్టుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.
దిల్‌రాజు సమర్పణలో గుణటీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. 3డి ఫార్మాట్ కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ సినిమాతో వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం.