English | Telugu
తమ్ముడు ఓటిటి డేట్!
Updated : Jul 16, 2025
నితిన్ ఈ నెల 4 న 'తమ్ముడు'(Thammudu)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత 'దిల్ రాజు'(Dil Raju)నిర్మించగా, ఎంసిఏ, వకీల్ సాబ్ వంటి హిట్ చిత్రాలని తెరకెక్కించిన 'వేణు శ్రీరామ్'(Venu Sriram)దర్శకుడుగా వ్యవహరించాడు. లయ(Laya),సప్తమి గౌడ(Sapthami Gowda), వర్ష బొల్లమ్మ,శ్వాసిక విజయ్, సౌరభ్ సచ్ దేవ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
తమ్ముడు మూవీ ఓటిటి హక్కులని 'నెట్ ఫ్లిక్స్'(Net Flix)సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆగష్టు 1 నుంచి సదరు సంస్థ స్ట్రీమింగ్ కి రెడీ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేక నితిన్ ఖాతాలో మరో ప్లాప్ చిత్రంగా నిలిచింది. అందుకే ముందుగానే ఓటిటిలోకి తీసుకొస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన రానుందని కూడా అంటున్నారు.
అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో తెరకెక్కిన 'తమ్ముడు' లో నితిన్, లయ అక్కా తమ్ముడిగా బాగానే నటించారు. మిగతా పాత్రల్లో చేసిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు. అజనీష్ లోక్ నాధ్ సంగీతాన్ని అందించాడు.