English | Telugu
టికెట్ రేట్ 200 దాటకూడదు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
Updated : Jul 16, 2025
ప్రస్తుత రోజుల్లో ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే టికెట్ రేట్లు చాలా హైగా ఉంటున్నాయి. మల్టిప్లెక్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు. వేలకి వేలు ఖర్చవుతున్నాయి. దీంతో చాలా ఫ్యామిలీస్ సినిమాకి దూరం అవుతు వస్తున్నాయి.
దీంతో కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt)సినిమా టికెట్ గరిష్ట ధర సింగల్ స్క్రీన్ థియేటర్,మల్టిప్లెక్స్ థియేటర్ అయినా 200 రూపాయిలకి మించి ఉండకూడదని ముసాయిదా నోటిఫికేషన్ ని జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తు ప్రజలందరికి సినిమా చేరువ కావాలి. టికెట్ దరల భారంతో సామాన్యులు వెనకడుగు వేయడం మానిపించాలి. కొన్ని మల్టిప్లెక్స్ లో టికెట్ రేట్స్ 500 నుంచి 1000 దాకా ఉన్నాయంటూ కూడా తన ప్రకటనలో తెలిపింది. ఇక కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ పై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే పదిహేను రోజులుగా చెప్పవచ్చు.