English | Telugu
చిరుని అనుకరించిన అల్లు అర్జున్
Updated : Jun 3, 2011
చిరుని అనుకరించిన అల్లు అర్జున్ అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం" బద్రీనాథ్". ఈ సినిమాలోని "ఓంకారేశ్వరి" పాటలో అల్లు అర్జున్ కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ లో మెగా స్టార్ చిరంజీవిని అనుకరించాడు. ఆ విషయాన్ని స్వయంగా అల్లు అర్జునే మీడియాతో చెప్పాడు. "నేను కావాలనే ఓంకారేశ్వరి పాటలో చిరంజీవిగారిని అనుకరించాను. ఇది ఆయన మీద అభిమానంతో ఆయనకు నేనిచ్చే నివాళిగా భావిస్తున్నాను. దీన్ని ఆయన, ఆయన అభిమానులు కూడా మెచ్చుకుంటారని భావిస్తున్నాను" అని కూడా అన్నాడు.
"బద్రీనాథ్" సినిమాలో అల్లు అర్జున్ జుట్టు పొడవుగా పెంచాడు. పెంచాడని అంతా అనుకున్నారు. కానీ అది అతని సొంత జుట్టు కాదనీ, "హెయిర్ ఎక్స్ టెన్షన్" అనే ప్రక్రియ ద్వారా అలా జుట్టు పొడవుగా చేయించుకోవచ్చనీ, అందుకు 40 గంటల సమయం పడుతుందనీ, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ప్రేక్షకులకు తెలియజేశాడు. కీరవాణి సంగీతం అందించిన "బద్రీనాథ్" సినిమా జూన్ పదవ తేదీన విడుదల కానుంది.