English | Telugu

అల్లు అర్జున్ బద్రీనాథ్ సెన్సారు పూర్తి

అల్లు అర్జున్ "బద్రీనాథ్" సెన్సారు పూర్తయిందని ఫిలిం నగర్ వర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం" బద్రీనాథ్". అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమా సెన్సారు కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాకి సెన్సారు వారు "ఎ" సర్టిఫికేట్ ను ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాలోని మూడు సన్నివేశాలకు మూడు కట్స్ కూడా ఇచ్చారట.

అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లోనూ, సినీ పరిశ్రమలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. చిన్ని కృష్ణ కథ, వి.వి.వినాయక్ దర్శకత్వ ప్రతిభ, కీరవాణి సంగీతం, తమన్నా అందచందాలు, అల్లు అర్జున్ నటన ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయని అనుకుంటే వీటన్నిటికంటే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రాజీపడని నిర్మాణపు విలువలు ఈ సినిమాని మరింత ఎత్తుకు వెళ్ళేలా చేశాయి. అయితే ఈ స్థాయిలో అంచనాలు పెరిగిన తర్వాత ఆ అంచనాలను గనక ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమా అందుకోలేకపోతే ఘోరంగా దెబ్బతినే అవకాశాలతో పాటు ఇది మరో "శక్తి" గా మారే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇలాంటి ఊహాగానాలకు జూన్ పదవ తేదీ తెరపడనుంది. ఎందుకంటే అల్లు అర్జున్ "బద్రీనాథ్" ఆ రోజునే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.