English | Telugu

ఓటీటీలోకి ఆది సాయికుమార్ సూపర్ హిట్ మూవీ 'శంబాల'

Publish Date:Jan 15, 2026

  చాలా కాలం తర్వాత ఆది సాయికుమార్ కి రిలీఫ్ ఇచ్చిన మూవీ 'శంబాల'. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్.. వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.   శంబాల' మూవీ ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. జనవరి 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ ఒక రోజు ముందుగానే ఈ సినిమాను చూడొచ్చు.     మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకున్న 'శంబాల' సినిమాని దర్శకుడు యుగంధర్ ముని రూపొందించారు. అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.    థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధించిన శంబాల.. ఓటీటీలో కూడా అదే స్థాయి స్పందన తెచ్చుకుంటుందేమో చూడాలి.   Also Read: శంబాల మూవీ రివ్యూ  

Yellamma Glimpse: Intriguing and Powerful 

Publish Date:Jan 15, 2026

Under the visionary presentation of Dil Raju, the upcoming film Yellamma is set to delve deep into the rich tapestry of Indian folklore and spiritual traditions. Directed by Venu Yeldandi, the film follows the director's trend of exploring rooted, culturally significant narratives that resonate with local audiences. Produced by Shirish for Sri Venkateswara Creations, the project is being hailed as a "musical social drama" that bridges the gap between ancient beliefs and modern storytelling. At the heart of this ambitious project is Rockstar Devi Sri Prasad, who takes on the lead role of a traditional percussionist named Parshi. This character is expected to showcase a side of DSP never seen before, blending his natural rhythmic energy with a grounded, dramatic performance. Set against a rural backdrop, the film explores the mysticism surrounding the divine force of Yellamma, a deity deeply revered in regional culture. The first glimpse, released on Makara Sankranthi, has already set a mysterious and emotional tone, highlighting the film’s high production values and soulful atmosphere. By combining the musical genius of DSP with the sensitive direction of Venu Yeldandi, Yellamma aims to be more than just a debut; it is a cinematic tribute to native heritage and the power of faith.

ఒకే సంవత్సరం 8 సినిమాలు.. అందులో 5 బ్లాక్‌బస్టర్స్‌.. అదీ శోభన్‌బాబు స్టామినా!

Publish Date:Jan 14, 2026

(జనవరి 14 శోభన్‌బాబు జయంతి సందర్భంగా..) 1937 జనవరి 14న కృష్ణా జిల్లాలో జన్మించిన ఉప్పు శోభనాచలపతిరావు అలియాస్‌ శోభన్‌బాబు తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న హీరో. తను హీరోగానే రిటైర్‌ అవుతాను తప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు కనిపించకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్న ఆయన.. హీరోగానే రిటైర్‌ అయ్యారు. ఆ తర్వాత తండ్రిగా, తాతగా నటించే అవకాశాలు ఎన్ని వచ్చిన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేయలేదు. శోభన్‌బాబు కెరీర్‌ ఎంతో విలక్షణంగా సాగింది. హీరోగా తనను తాను ప్రూవ్‌ చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. 1959లో దైవబలం చిత్రంతో నటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శోభన్‌బాబు.. సోలో హీరో అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది. పాతిక సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు, కొంత ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చెయ్యాల్సి వచ్చింది.   హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఆయన్ని స్టార్‌ హీరోని చేసిన సంవత్సరం 1975. శోభన్‌బాబు కెరీర్‌లో ఈ సంవత్సరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం ఆయన నటించిన 8 సినిమాలు రిలీజ్‌ కాగా, అందులో 5 సినిమా బ్లాక్‌బస్టర్స్‌గా, శతదినోత్సవ సినిమాలుగా నిలిచాయి. అంతేకాదు, తను చేసిన సినిమాల మధ్యే పోటీ ఏర్పడడం విశేషంగా చెప్పుకోవచ్చు.   1975 సంవత్సరం జనవరిలో తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రం విడుదలైంది. శోభన్‌బాబు హీరోగా నటించిన తొలి కలర్‌ సినిమా ఇదే. ఈ సినిమాలో శారద ద్విపాత్రాభినయం చేశారు. చక్కని కథ, గుండెల్ని పిండేసే సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాను 15 కేంద్రాల్లో 50 రోజులు, 3 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో ఉదయం ఆటను ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారు.   ఏప్రిల్‌లో ఎస్‌.ఎస్‌.బాలన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘అందరూ మంచివారే’. అంతకుముందు ‘మంచి మనుషులు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రంలో కలిసి నటించిన శోభన్‌బాబు, మంజుల ఈ సినిమాలో మరోసారి జోడీ కట్టారు. సాంఘిక చిత్రాల్లో తొలిసారి ఈ సినిమా కోసం 6 లక్షల రూపాయలతో ఒక భారీ సెట్‌ను నిర్మించడం విశేషం. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.   మే నెలలో కె.రాఘవేంద్రరావు దర్శకుడుగా రూపొందిన తొలి సినిమా ‘బాబు’ విడుదలైంది. ఇందులో శోభన్‌బాబు, వాణిశ్రీ, అరుణా ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. 25 లక్షల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. తొలివారం 16 లక్షలు కలెక్ట్‌ చేయడం విశేషం. రెండు వారాల వరకు ఫర్వాలేదు అనిపించినా ఆ సమయంలోనే శోభన్‌బాబు, వాణశ్రీలతోనే కె.విశ్వనాథ్‌ రూపొందించిన ‘జీవనజ్యోతి’ విడుదలై ఘనవిజయం సాధించడంతో ‘బాబు’ చిత్రంపై ఆ ప్రభావం ప‌డింది. ఫలితంగా ‘బాబు’ ఏవరేజ్‌ మూవీగా నిలిచింది.   శోభన్‌బాబు, శారద జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘బలిపీఠం’ చిత్రం జూలై 17న విడుదలైంది. రంగనాయకమ్మ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. శోభన్‌బాబు, శారద నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.   శోభన్‌బాబు, మంజుల జంటగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ‘జేబుదొంగ’ చిత్రం ఆగస్ట్‌ 14న విడుదలైంది. అప్పటి వరకు ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ వచ్చిన శోభన్‌బాబుపై జేబుదొంగ అనే టైటిల్‌ వర్కవుట్‌ అవ్వదని, తప్పకుండా ఫ్లాప్‌ అవుతుందని ఇండస్ట్రీలోని ప్రముఖులు భావించారు. కానీ, వారి అంచనాలను తారుమారు చేస్తూ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమా తర్వాత నవంబర్‌లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో శోభన్‌బాబు, మంజుల జంటగా వచ్చిన ‘గుణవంతుడు’ చిత్రం పెద్దగా ఆడలేదు.   ఇక ఈ సంవత్సరం డిసెంబర్‌ 19న వచ్చిన ‘సోగ్గాడు’ చిత్రం సంచలన విజయం సాధించి శోభన్‌బాబు పేరుకు ముందు సోగ్గాడు చేరింది. కె.బాపయ్య దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలో జయచిత్ర, జయసుధ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయి శోభన్‌బాబు కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌ మూవీగా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో మరో సినిమాతో కె.బాపయ్య బిజీగా ఉండడంతో హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాలను ఆయన కజిన్‌ కె.రాఘవేంద్రరావు చిత్రీకరించడం విశేషం. 1975లో శోభన్‌బాబు హీరోగా వచ్చిన 8 కలర్‌ సినిమాల్లో 5 సినిమాలు ఘనవిజయం సాధించాయి. అలా ఈ సంవత్సరం శోభన్‌బాబు కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచింది.

ఆ సినిమా బ్యాన్‌ చెయ్యాలంటూ లేడీ గ్యాంగ్‌స్టర్‌ పిటిషన్‌.. 2 కోట్లు డిమాండ్‌!

Publish Date:Jan 14, 2026

వయొలెంట్‌ లవ్‌స్టోరీగా విజయ్‌ దేవరకొండ, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హిందీలో షాహిద్‌ కపూర్‌ హీరోగా ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో రూపొందించారు సందీప్‌రెడ్డి. హిందీలో కూడా ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఆ తర్వాత రణబీర్‌ కపూర్‌తో సందీప్‌ చేసిన ‘యానిమల్‌’ కూడా మోస్ట్‌ వయొలెంట్‌ మూవీగా నిలిచింది.    ఈ క్రమంలోనే షాహిద్‌ కపూర్‌ హీరోగా విశాల్‌ భరద్వాజ దర్శకత్వంలో హిందీలో ‘ఓ రోమియో’ పేరుతో ఓ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 13న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్‌, ట్రైలర్‌ ఆల్రెడీ విడుదలయ్యాయి. వాటిని పరిశీలిస్తే.. అది కబీర్‌సింగ్‌, యానిమల్‌ సినిమాలను పోలి ఉంది. సినిమాలో పరిధులు దాటిన హింస ఉన్నట్టుగా తెలుస్తోంది.    ఇప్పుడు ‘ఓ రోమియో’ సినిమా చట్టపరమైన చిక్కుల్లో పడిరది.  ఈ చిత్రానికి సంబంధించి ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ హుస్సేన్‌ ఉస్తారా కుమార్తె సనోబర్‌ షేక్‌.. ‘ఓ రోమియో’ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా, దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌లకు నోటీసులు పంపారు. ఈ సినిమా తన తండ్రి హుస్సేన్‌ ఉస్తారా జీవిత కథ ఆధారంగా రూపొందుతోందని, ఇందులోని కథ తన తండ్రికి వ్యతిరేకంగా ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. అలా తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గానూ రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషన్‌ వేశారు.    ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిందని ట్రైలర్‌లో ప్రస్తావించారు. దీంతో ఈ వివాదానికి బలం చేకూరింది. ఫిబ్రవరి 13న ‘ఓ రోమియో’ రిలీజ్‌ కాబోతోంది. ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన వివాదాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, త్రిప్తి దిమ్రి, విక్రాంత్‌ మాస్సే, నానా పటేకర్‌, తమన్నా భాటియా, దిశా పటాని, అవినాష్‌ తివారీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమీనే, హైదర్‌, రంగూన్‌ తర్వాత షాహిద్‌, విశాల్‌ భరద్వాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది. 

Jayam serial: నిప్పు అంటించింది వీరూనే అని చెప్పేసిన గంగ.. రుద్ర నమ్ముతాడా?

Publish Date:Jan 15, 2026

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-168లో.. గంగ ఇంటికి రాగానే హారతి తీసుకొని వస్తుంది శకుంతల. దాని మీద ప్రమాణం చేసి చెప్పు.. ఇంకెప్పుడు బాక్సింగ్ ఆడనని ప్రమాణం చేసి చెప్పమని గంగతో శకుంతల అంటుంది. ‌ఇక బాక్సింగ్ దగ్గర ఏం జరిగిందో గంగ ఏడుస్తూ చెప్తుంది. ‌ రుద్రకి ప్రాణహాని ఉందని తెలిసి నేను లాస్ట్ మినిట్ లో రింగ్ నుండి బయటకు వచ్చాను లేదంటే గెలిచేదాన్ని అని గంగ రిక్వెస్ట్ చేస్తుంది. నన్ను ఛాంపియన్ గా చేయాలనేది రుద్ర సర్ కల..‌దయచేసి దానిని పాడుచేయొద్దు..‌ కావాలంటే నేను ఏ శిక్ష అయిన భరిస్తాను నన్ను క్షమించండి అత్తయ్య అని శకుంతల కాళ్ళ  మీద పడి ఏడుస్తుంది‌. ఇక గంగ ఏడ్వడం చూసి శకుంతల ఏం చేయలేకపోతుంది.    ఇక రుద్ర ఆలోచిస్తూ సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అందులో కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఇక రుద్రని వెతుక్కుంటూ సూపర్ మార్కెట్ కి  వెళ్తుంది గంగ. అదే సమయంలో మాస్క్ వేసుకున్న ఒకడు సూపర్ మార్కెట్ పైకి నిప్పు అంటించిన కర్రని విసిరేయడం గంగ చూస్తుంది. దాంతో వెంటనే లోపలికి వెళ్తుంది గంగ. నువ్వెందుకు వచ్చావ్ గంగ అని రుద్ర అడుగుతాడు. మీరెక్కడుంటే అక్కడే ఉంటానని గంగ అంటుంది. కాసేపటికి ఇద్దరు ఫైర్ నుండి బయటకి వస్తారు.    మరోవైపు ఇలా సూపర్ మార్కెట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని విషయం ఇంట్లో తెలుస్తుంది. పెద్దసారు, శకుంతలతో పాటు ఇంట్లోని వాళ్ళంతా టెన్షన్ పడతారు. కాసేపటికి గంగ, రుద్ర ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి అందరు కంగారుపడతారు. ఏం జరిగిందని శకుంతల అడుగుతుంది. గంగ ఏదో చెప్పబోతుంటే తనని రుద్ర ఆపి.. ‌ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని  చెప్తాడు. ఇంట్లో అన్నీ అశుభాలే జరుగుతున్నాయి.. అందుకే పెద్దవాళ్ళు చెప్పేది వినాలని శకుంతల అంటుంది.    మరుసటి రోజు రుద్ర ఒక్కడే కూర్చొని బాధపడుతుంటే ఇంట్లో ఉండే వాళ్ళు వచ్చి.. ఇది ఎలా జరిగిందని అడుగుతారు. ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదని ఎవరో కావాలని చేశారని రుద్ర అంటాడు. దాంతో అందరు టెన్షన్ పడతారు. ఇక అప్పుడే వీరు వచ్చి టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తాడు.    ఇక గంగ కాఫీ తీసుకొని వచ్చి రుద్రకి ఇచ్చి వెళ్తుంటుంది. అదే సమయంలో ఒకతను వీరుని చూసి.. తలకి ఆ దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతారు. అది వింటుంది గంగ. నిన్న ఫైర్ యాక్సిడెంట్ చేసిన వాడిని తలపై కొట్టింది గంగకి గుర్తొస్తుంది. వీడే ఫైర్ యాక్సిడెంట్ కి కారణం.. నేను రాయితో కొట్టానని గంగ అంటుంది. అది విన్న రుద్ర.. వెంటనే గంగని తన గదికి తీసుకొని వెళ్తాడు. ఏదైనా మాట్లాడేటప్పుడు సాక్ష్యాలతో మాట్లాడాలి.. నువ్వు నిరూపించలేనప్పుడు అలా‌ అనకూడదు.. ఇంతకముందు నాకు ఇలాగే జరిగిందని గంగని రుద్ర  హెచ్చరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Tiger Shroff to be part of Allu Arjun and Atlee film?

Publish Date:Jan 6, 2026

Allu Arjun has delivered a massive blockbuster with Pushpa 2 The Rule and his market in North India is huge. Taking that into consideration, Sun Pictures have accepted to give Atlee, a free hand to make his sci-fi fantasy drama on a never-seen-before scale with Hollywood VFX Studios, Action Co-ordinators collaborating on it.  Now, the reports suggest that the movie could be spilt into two parts and both will be shot at one go. The movie team won't be going back to shoot the second part but rather they would be spending 6-8 months on VFX and scale of the second part, if the reports are true.  Currently, the reports suggest that Tiger Shroff is in talks and he even joined the film for a crucial part. Will he be playing an antagonist or supporting protagonist is yet to be known. Vijay Sethupathi is said to be a part of the film. Already, Deepika Padukone is part of the film and she completed two schedules.  Mrunal Thakur and Janhvi Kapoor are said to be part of the project as there will be a triple role for Allu Arjun with connection between past lives and future. We have to wait and see, how many of these reports will emerge to be true. Atlee is currently working on meeting a Hollywood Studio to distribute the film, state reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

Nari Nari Naduma Murari

Publish Date:Dec 31, 1969

Anaganaga Oka Raju

Publish Date:Dec 31, 1969

The Raja Saab

Publish Date:Dec 31, 1969