English | Telugu
సర్దార్ ప్రిమియర్ షో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా...?
Updated : Apr 6, 2016
సినిమా రిలీజ్ సమయంలో పవన్ ఫ్యాన్స్ ను ఆపడం ఎవరి తరమూ కాదు. తమ హీరో కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడిపోతారు. చొక్కాలు చిరిగిపోయి, రక్తాలు వస్తున్నా టిక్కెట్ దొరికితే చాలనుకుంటారు. ఇప్పుడు సర్దార్ రిలీజ్ కు కౌంట్ డౌన్ నడుస్తోంది. దీంతో పవన్ మ్యానియా పీక్స్ కు చేరుకుంది. బెనిఫిట్ షో టిక్కెట్ కోసం యమ హెవీ డిమాండ్ ఉంది. రెండు వేలు ఖర్చయినా, సినిమా టిక్కెట్స్ దొరికితే చాలనుకుంటున్నారు పవన్ అభిమానులు. ప్రీమియర్ షో టిక్కెట్స్ కోసం ఫుల్ల్ క్రేజ్. మామూలు టిక్కెట్స్ కూడా 1500 రూపాయలకు తక్కువ లేవు. సినిమా చూడాలనుకునే వాళ్లు ఎప్పుడైనా చూస్తారు. కానీ పవన్ వీరాభిమానులు మాత్రం బెనిఫిట్ షో చూడాలని ఫిక్సై ఉంటారు.
అందుకే ఇంత డిమాండ్. బాల్కనీ టిక్కెట్ 2500 నుంచి 4000 వరకూ ఉంటే మిగిలిన టిక్కెట్స్ అన్నీ 1500 నుంచి 2000 మధ్య పలుకుతున్నాయి. షో ఆర్గనైజర్లు కూడా ఈ రేట్ ను తగ్గించే అవకాశం లేదంటున్నారు. థియేటర్ రెంట్, పోలీస్ క్లియరెన్స్ లాంటివన్నీ కలుపుకుంటే, తమకు కూడా తడిసి మోపెడవుతోందని, అందుకే టిక్కెట్ ధరలు ఈ రేంజ్ లో ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. రేపు అర్ధరాత్రి 12.30 నుంచి అన్ని ఏరియాల్లోనూ బెనిఫిట్ షోస్ నడుస్తున్నాయి. టికెట్లు దొరికే ఛాన్సులు లేకపోయినా, పవన్ అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా బెనిఫిట్ షో చూడాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఫ్యాన్స్ అంటే అంతేమరి. వాళ్లకు క్యాలిక్యులేషన్స్, రెగులేషన్స్ ఉండవు. ఒన్లీ ఎమోషన్స్...!