English | Telugu

రామ్ చరణ్ రచ్చలో కలర్స్ స్వాతి

రామ్ చరణ్ "రచ్చ" లో కలర్స్ స్వాతి నటిస్తూందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యువహీరో రామ్ చరణ్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా,"ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". ఈ రామ్ చరణ్ "రచ్చ" సినిమా జూన్ రెండవ వారంలో ప్రారంభం కానుంది. ఈ రామ్ చరణ్ "రచ్చ" సినిమాలో కలర్స్ స్వాతి ఒక ముఖ్య పాత్రలో నటించనుందట. అలాగే రామ్ చరణ్ "రచ్చ" దర్శకుడు సంపత్ నంది అభ్యర్థన మేరకు స్వాతి ఈ చిత్రంలో ఒక పాటను కూడా పాడనుందని తెలిసింది.

స్వాతి గతంలో "అష్టచమ్మ, కలవరమాయె మదిలో, గోల్కొండ హైస్కూల్" వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో "100%లవ్" సినిమాలో "ఏ స్క్వేర్ బి స్క్వేర్" అనే హిట్ సాంగ్ ని కూడా పాడి గాయకురాలిగా కూడా మారింది. రామ్ చరణ్ "రచ్చ" సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు. రామ్ చరణ్ "రచ్చ" సినిమాలో కొంత భాగం శ్రీలంకలో షూటింగ్ జరుపుకోనుందట. ఈ సినిమా కోసం హీరో రామ్ చరణ్ శారీరకంగా విదేశంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.