English | Telugu

బచ్చన్, పూరీ బుడ్డా టైటిల్ సాంగ్

"బుడ్డా" హోగా తేరా బాప్ టైటిల్ సాంగ్ సంచలనాన్ని సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా, ప్రకాష్ రాజ్, ఛార్మి, సుబ్బరాజు, సోనూ సూద్, హేమా మాలిని, రవీనా టాండన్, మినీషా లాంబ, సోనాల్ చౌహాన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తూండగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రమ"బుడ్డా". క్యాప్షన్ "హోగా తేరా బాప్". ఈ "బుడ్డా" హోగా తేరా బాప్ సినిమాలో అమితాబ్ బచ్చన్ రిటాయర్డ్ హిట్ మేన్ గా నటిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్ గతంలో నటించిన "దీవార్, జంజీర్, అగ్నిపథ్, డాన్, ముకద్దర్ కా సికిందర్,షెహన్ షా, హమ్" వంటి సినిమాల్లో ఆయన డైలాగులకు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన లభించింది. అలాగే ఈ "బుడ్డా" హోగా తేరా బాప్ సినిమాలో కూడా డైలాగులు అదే రేంజ్‍ లో పేల్తాయని బాలీవుడ్ సినీవర్గాలంటున్నాయి. "బుడ్డా" హోగా తేరా బాప్ సినిమా టైటిల్ సాంగ్ ఇటీవల విడుదలయ్యింది. ఈ టైటిల్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తూంది. "బుడ్డా" హోగా తేరా బాప్ సినిమా జూలై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.