English | Telugu

రమణ గోగుల గుండు వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉందని తెలుసా?

రమణ గోగుల ఎప్పుడూ గుండుతోనే ఎందుకుంటారు?
అది స్టైలో, జుట్టు లేకపోవడమో అనుకుంటే పొరపాటే
దాని వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది

సినిమా వాళ్ళు రంగుల ప్రపంచంలో బ్రతుకుతుంటారు. వారికి బాధలు, భావోద్వేగాలు ఉండవని చాలామంది అనుకుంటుంటారు. తెరపై ఎలా కనిపించినా.. నిజ జీవితంలో వారూ సాధారణ మనుషులే. వారికీ సెంటిమెంట్స్ ఉంటాయి. వారిలోనూ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల(Ramana Gogula) జీవితంలో కూడా అలాంటి ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది.

దాదాపు ఒక దశాబ్దం పాటు తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు రమణ గోగుల. అయితే ఆయన పాటలు ఎంత ఫేమస్సో.. ఆయన లుక్ కూడా అంతే ఫేమస్. ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తుంటారు. అయితే ఆయనలా గుండుతో కనిపించడం వెనుక భక్తితో కూడిన ఓ భావోద్వేగం ఉంది.

రమణ గోగుల 'జానీ' సినిమాకు వర్క్ చేస్తున్న సమయంలో ఆయన భార్య ప్రెగ్నెంట్. అయితే అప్పుడు డాక్టర్లు ఆమె ఆరోగ్యం బాలేదని, డెలివరీ చాలా కష్టమని చెప్పారు. ఆ బాధలో రమణ గోగుల ఉండగా.. తన టీంలోని ఒక వ్యక్తి, ఓసారి తిరుపతికి వెళ్లిరమ్మని సూచించాడు. అప్పుడు రమణ గోగుల తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించారు. ఆ తర్వాత ఆయన భార్యకు నార్మల్ డెలివరీ అయింది. ఆ క్షణమే జీవితాంతం గుండుతో ఉండాలని రమణ గోగుల డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రమణ గోగుల చెప్పడం విశేషం.

కళాకారులు సున్నిత మనస్కులు, వారు ఎమోషన్స్ కి వాల్యూ ఇస్తారు అనడానికి.. రమణ గోగుల జీవితంలోని ఈ సంఘటనను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

కమల్ హాసన్ పై కస్తూరి కీలక వ్యాఖ్యలు.. మధ్యలో తెలుగోళ్లు వచ్చారు 

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan)..సీనియర్ నటి కస్తూరి(kasturi).. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ఈ ఇద్దరు సుదీర్ఘ కాలం నుంచే తెలుగు సినిమాల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా కమల్ సినీ గ్రాఫ్ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. ఇక ఆ ఇద్దరు భారతీయుడు లో అన్నా చెల్లెళ్లుగా, తండ్రి కూతుళ్లుగా చేసి అభిమానులని తమ పెర్ ఫార్మెన్స్ తో అలరించారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులు. ఈ విషయాన్నీ గుర్తు చేస్తు కమల్ హాసన్ పై కస్తూరి చేసిన తాజా వ్యాఖ్యలు సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.