English | Telugu

కమల్ హాసన్ పై కస్తూరి కీలక వ్యాఖ్యలు.. మధ్యలో తెలుగోళ్లు వచ్చారు 

-కమల్ హాసన్ ఏం చెప్పాడు
-కస్తూరి ఏం చెప్తుంది
-అసలు విషయం ఏంటి

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan)..సీనియర్ నటి కస్తూరి(kasturi).. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ఈ ఇద్దరు సుదీర్ఘ కాలం నుంచే తెలుగు సినిమాల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా కమల్ సినీ గ్రాఫ్ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. ఇక ఆ ఇద్దరు భారతీయుడు లో అన్నా చెల్లెళ్లుగా, తండ్రి కూతుళ్లుగా చేసి అభిమానులని తమ పెర్ ఫార్మెన్స్ తో అలరించారు. కానీ ఇప్పుడురాజకీయంగా ప్రత్యర్థులు. ఈ విషయాన్నీ గుర్తు చేస్తు కమల్ హాసన్ పై కస్తూరి చేసిన తాజా వ్యాఖ్యలు సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.


కమల్ ప్రస్తుతం అధికార డిఎంకె మద్దతుతో తన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యం నుంచి రాజ్యసభ ఎంపి గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కమల్ రాజ్యసభ లో మహాకవి శ్రీశ్రీ(sri Sri) రాసిన 'జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్ అనే లైన్స్ ని చెబుతూ 'ఏ ప్రభుత్వం కూడా శాశ్వతంగా కాదంటూ బిజెపి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేసాడు. ఈ కామెంట్స్ పైకస్తూరి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు కమల్ హాసన్ చెప్పే మాటలు కన్ఫ్యూజ్ గా ఉంటాయి.సదరు మాటలు ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా అర్ధం కావు .తెలుగు వారిని కూడా కమల్ హాసన్ పట్టించుకోలేదు అని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చింది.


Also read:రణవీర్ సింగ్ కి బెదిరింపులు.. చేసింది వాళ్లేనా!


ప్రస్తుతం ఆమె మాటలు వైరల్ అవుతున్నాయి. కస్తూరి బిజెపి పార్టీ సభ్యురాలు. మరి ఆమె వ్యాఖ్యలపై మాట్లాడడానికి కమల్ తో పాటు అభిమానులు సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటారేమో చూడాలి.