English | Telugu

మొదటిసారి వెబ్ సిరీస్ చేస్తున్న రవితేజ!

తన కెరీర్ లో ఎన్నో ఘన విజయాలను అందుకున్న రవితేజ(Ravi Teja).. కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి'(Irumudi) సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. 'ఇరుముడి'తో రవితేజ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే, రవితేజ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు కూడా ఓటీటీ షోలు, సిరీస్ లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, వెంకటేష్, రానా, నాగ చైతన్య వంటి హీరోలు ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రవితేజ కూడా అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.

ఒక వెబ్ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రవితేజను సంప్రదించిందట. రవితేజ కూడా సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.

Also Read: రికార్డు ఓటీటీ డీల్ తో సంచలనం సృష్టిస్తున్న డ్రాగన్!

కమల్ హాసన్ పై కస్తూరి కీలక వ్యాఖ్యలు.. మధ్యలో తెలుగోళ్లు వచ్చారు 

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan)..సీనియర్ నటి కస్తూరి(kasturi).. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ఈ ఇద్దరు సుదీర్ఘ కాలం నుంచే తెలుగు సినిమాల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా కమల్ సినీ గ్రాఫ్ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. ఇక ఆ ఇద్దరు భారతీయుడు లో అన్నా చెల్లెళ్లుగా, తండ్రి కూతుళ్లుగా చేసి అభిమానులని తమ పెర్ ఫార్మెన్స్ తో అలరించారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులు. ఈ విషయాన్నీ గుర్తు చేస్తు కమల్ హాసన్ పై కస్తూరి చేసిన తాజా వ్యాఖ్యలు సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.