Home

»

Latest News

రూల్ ఏదైనా డోంట్ కేర్.. నేషనల్ లెవల్లో అల్లు అర్జున్ నామస్మరణ

Feb 11, 2026

 

 


-అల్లు అర్జున్ కట్ అవుట్ కి ఉన్న స్టామినా తెలుస్తుందా!
-వివరణలు ఇచ్చిన ఆగని వైరల్ 
-ఫ్యాన్స్ హ్యాపీ  


నా లెవల్ నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అని ఆన్ ది స్క్రీన్ ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)నోటి నుంచి ఏ ముహూర్తాన వచ్చిందో గాని, ఇప్పుడు ఆఫ్ ది స్క్రీన్ కూడా సేమ్ సిట్యువేషన్. యాడ్స్ చేసే సమయంలో అల్లు అర్జున్ బిహేవియర్ అంత బాగోదనే రీతిలో  రాయల్ ఎన్ ఫీల్డ్  బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ 'కావేరి బారువా' మాట్లాడిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై అల్లు అర్జున్  టీం రంగంలోకి దిగి ఆమె చెప్పేది రాంగ్ అని చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ తో సన్నిహితంగా ఉండే కొంత మంది నటులతో పాటు వివిధ రంగాలకి సంబంధించిన వాళ్ళు కూడా కావేరి బారువా మాట్లాడిన మాటలని ఖండించారు. 

కానీ మ్యాటర్ ఏదైనప్పటికీ  సదరు సంఘటనలు మాత్రం ప్రస్తుతం నేషనల్ లెవల్లో  అల్లు అర్జున్ నామ స్మరణ ఎక్కువగా వినిపిస్తుంది.కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా నేషనల్ మీడియాలలో సైతం సదరు చర్చ నే  నడుస్తుంది. మరి ఇదంతా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. అల్లు అర్జున్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా అట్లీ(Atlee)తో చేస్తున్న తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు.

Also read:  తెలుగు సినిమాని వేడుకుంటున్న థియేటర్స్   

 

అల్లు అర్జున్ నుంచి వస్తున్నమొట్ట మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో, మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ భామ దీపికా పదుకునే(Deepika Padukune)కీలకమైన క్యారక్టర్ లో చేస్తుండగా సన్ పిక్చర్స్ అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com