English | Telugu

తెలుగు సినిమాని వేడుకుంటున్న థియేటర్స్ 


-థియేటర్స్ యొక్క ఆత్మ ఘోష ఏంటి
-అభిమానులు ఏమంటున్నారు
-హీరోలు ఏం చెయ్యాలి

కరెక్ట్ కౌంటింగ్ అనవసరం.. ఎన్ని కోట్ల రూపాయల డబ్బుపెట్టి సినిమా నిర్మించినా థియేటర్(Theater)లో రిలీజ్ కావాల్సిందే. కలియుగం ప్రారంభంలోనే పుట్టిన సినిమా లక్ష్యం కూడా అదే. దీంతో తాము అభిమానించే హీరోల సాక్షిగా తమ చంటి బిడ్డ మొదటి పుట్టిన రోజుకి డెకరేషన్ చేసినట్టుగా థియేటర్ ని డెకరేషన్ చేసి థియేటర్ అందాన్ని చూసి మురిసిపోయే వాళ్ళు ఎంతో మంది. థియేటర్ లోపల సినిమా చూస్తు అమ్మ ఒడిలో సేదతీరిన ఫీల్ ని పొందిన వారు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉంటారు.డై హార్ట్ ఫ్యాన్స్ అయితే డైలీ నైట్ థియేటర్ వెళ్లి తమ అభిమాన హీరో సినిమా కలెక్షన్స్ చూసీ జిందాబాద్ కొట్టి ఇంటికి వెళ్లే నియమాన్ని తమ ఆనవాయితీగా పెట్టుకుంటారు. థియేటర్ అంత శోభాయమానంగా ఎదిగింది. కానీ ఇప్పుడు ఆ చరిత్ర డైలీ కనపడటం లేదు. డైలీ అంటే అత్యాశ అవుతుందేమో కనీసం వారానికి, నెలకి కూడా ఉండటం లేదు. తన బాధని మొత్తం తనలోనే దాచుకొని ఏ రోజుకైనా తనని పట్టించుకొనే యోధుడు రాకపోతాడా అని ఎదురుచూస్తూ ఉంది. తన ఎదురుచూపులకి కారణం ఏంటో చూద్దాం.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు బడా హీరో నుంచి మధ్య, చిన్న హీరోలు కంటిన్యూ గా సినిమాలు చేస్తుండే వాళ్ళు. దీంతో థియేటర్స్ లో విజయవంతంగా సాగుతున్న కొత్త చిత్రానికి రెస్ట్ అవసరమైనప్పుడల్లా ఇంకో కొత్త సినిమా వస్తుండేది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చిత్రాలు థియేటర్స్ లో అడుగుపెడుతుండేవి. దీంతో ఒక సిటీ లో ఎన్ని థియేటర్స్ ఉంటాయో, అవన్నీ కొత్త, పాత సినిమాలతో కలలకాలాడుతూ విజయ గర్వంతో మురిసిపోతుండేవి. కానీ ప్రస్తుత పరిస్థితి ఆ విధంగా లేదు. బడా హీరోలు రెండు ఏళ్లకి ఒక సినిమా చేస్తున్నారు. ఒక మోస్తరు హీరోలు కూడా ఇంచు మించు అదే టైం. అప్పటికప్పుడు లైవ్ లో పుట్టిన చోటా,బడే చోటా మియా హీరోల సినిమాలు మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.ప్రేక్షకుడి సంగతి పక్కన పెడితే సదరు చిత్రాలని తెరకెక్కించిన మేకర్స్ నే ఇదేంటి మన సినిమా ఇంత చెత్తలాగా ఉందనుకునే పరిస్థితి. దీంతో థియేటర్ సైతం మౌనంగా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి.

also read:వీడియో రిలీజ్ చేసిన నటుడు.. కన్నీళ్లు ఒకటే తక్కువ

ఇప్పుడు ఈ విషయంపై థియేటర్ తరుపున వకాల్తా పుచ్చుకొని మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు పెద్ద హీరోలు పాన్ ఇండియా సినిమాతో పాటు లోకల్ మూవీ పారలల్ గా చెయ్యాలి. నాలుగు నెలల్లో సినిమారిలీజ్ అయ్యేలాచెయ్యాలి. మీరు అగ్ర స్థాయికి రావడానికి కారణం థియేటర్ అని మర్చిపోవద్దు. ఇతర చిన్న హీరోలు సైతం ఇదే సూత్రాన్ని అవలంబిస్తు థియేటర్ కి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. ఓటిటి లో ఇచ్చే డేట్ ని పొడిగించాలి. లైవ్ లో సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్న హీరోలు, మేకర్స్ సబ్జెట్ పై దృష్టి పెట్టాలి. ఆల్రెడీ ఇప్పటికే చాలా థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ప్రెజెంట్ బడా హీరోల సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే థియేటర్స్ ని ఓపెన్ చేస్తున్నారు.

దీన్ని బట్టి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి వెంట వెంటనే సినిమాలు చేసి థియేటర్ ని బతికించండి. ఈ విషయంలో తనకి ఏడుపు తన్నుకుంటూ వస్తున్నా సింహం లాంటి లాంటి తానే ఏడిస్తే అభిమానులు బాధపడతారని ఆ పని చెయ్యటం లేదని మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా థియేటర్ తరుపున వకాల్తా పుచ్చుకొని చెప్తున్నారు.


కమల్ హాసన్ పై కస్తూరి కీలక వ్యాఖ్యలు.. మధ్యలో తెలుగోళ్లు వచ్చారు 

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan)..సీనియర్ నటి కస్తూరి(kasturi).. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ఈ ఇద్దరు సుదీర్ఘ కాలం నుంచే తెలుగు సినిమాల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా కమల్ సినీ గ్రాఫ్ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. ఇక ఆ ఇద్దరు భారతీయుడు లో అన్నా చెల్లెళ్లుగా, తండ్రి కూతుళ్లుగా చేసి అభిమానులని తమ పెర్ ఫార్మెన్స్ తో అలరించారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులు. ఈ విషయాన్నీ గుర్తు చేస్తు కమల్ హాసన్ పై కస్తూరి చేసిన తాజా వ్యాఖ్యలు సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.