English | Telugu

వాళ్ళ నిజస్వరూపాలు నాకు తెలుసు.. రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు  

Publish Date:Dec 20, 2025

        -ఎవరు వాళ్ళు? -ఏం చెప్పింది -సంచలనంగా మారిన స్పీచ్        రామ్ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన 'రక్త చరిత్ర' రెండు భాగాల్లో అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించిన భామ రాధిక ఆప్టే. ఈ చిత్రమే ఆమె మొదటి తెలుగు మూవీ.  ఆ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ తో లెజండ్, లయన్ వంటి చిత్రాల్లో జత కట్టి మరింత దగ్గరయ్యింది. రీసెంట్ గా ఆమె తన సినీ జర్నీకి  20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.       రాధికా ఆప్టే మాట్లాడుతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని దక్షిణాది సినిమాల్లో నటించాల్సి వచ్చింది.కానీ సదరు సినిమా సెట్స్‌లో ఎదురైన అనుభవాలు తీవ్రంగా కలచివేసాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో షూటింగ్‌లు జరిగేటప్పుడు సెట్‌లో నేను మాత్రమే మహిళని.  మహిళల శరీరాల గురించి అసభ్యకరమైన జోకులు వేయడం, చెస్ట్ ప్యాడింగ్ వాడాలని ఒత్తిడి చేయడం వంటి ఘటనలు తనను తీవ్ర అసౌకర్యానికి గురి చేసాయి. నేను సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటాను. కానీ ఆ రోజులని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నా గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది. బాలీవుడ్‌లోని కొందరు పెద్ద వ్యక్తుల నిజస్వరూపాలు కూడా నాకు తెలుసు. నాకు వచ్చిన సినిమా ఆఫర్ల సందర్భంగా కొందరిని కలిశాను. వారితో మాట్లాడిన తర్వాత ఇక జీవితంలో మళ్లీ వారిని కలవకూడదని నిర్ణయించుకున్నా. వాళ్లు చాలా పేరున్న వ్యక్తులు. వారి పేర్లు చెబితే అందరూ షాకవుతారు అంటు చెప్పుకొచ్చింది.      Also read:   ఆంధ్ర కింగ్ తాలూకా ఓటిటి డేట్ ఇదే      తమిళనాడు లోని వేలూరు కి చెందిన రాధికా ఆప్టే 2005 లో 'వాహ్ లైఫ్ హో తో అసి' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హిందీలో సుమారు పదిహేను చిత్రాల వరకు చేసింది. దాదాపుగా బారతీయ అన్ని భాషల్లోను మెప్పించిన రాధిక వెబ్ సిరీస్ లోను తన సత్తా చాటుతుంది. ఈ ఏడాది జనవరిలో లాస్ట్ డేస్ అనే అమెరికన్ ఇంగ్లీష్ మూవీలో కనిపించగా, ఈ నెల 12 న సాలి మహబ్బత్ అనే వెబ్ సిరీస్ తో అడుగుపెట్టింది.  

BMW will present Ravi Teja in his vintage style

Publish Date:Dec 20, 2025

The upcoming Sankranti entertainer, Bharta Mahasayulaku Wignapthy, is generating significant buzz following the massive success of its teaser and soundtrack. Starring Mass Maharaja Ravi Teja alongside Dimple Hayathi and Ashika Ranganath, the film promises a return to the actor’s vintage comedic roots. During a recent media interaction, producer Sudhakar Cherukuri revealed that Ravi Teja was so impressed by the script that he opted to work on the project without upfront remuneration. After a string of heavy action dramas, the actor was reportedly eager to dive back into a character-driven comedy. Director Kishore Tirumala highlighted the efficiency of the production, noting that the project was completed within five months due to a disciplined script. He emphasized that Ravi Teja encouraged a grounded approach, requesting that the story remain simple rather than being inflated for his "mass" image.  Addressing the film's themes, Tirumala clarified that it offers a fresh perspective on relationships, steering clear of typical "wife-bashing" tropes. He praised Ravi Teja’s exceptional comic timing, asserting that his performance will feel remarkably fresh to audiences. The film is set for a grand theatrical release on January 13, 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

సూర్యకాంతం మరణం.. పట్టించుకోని టాలీవుడ్‌ ప్రముఖులు.. ఎందుకని?

Publish Date:Dec 18, 2025

(డిసెంబర్‌ 18 నటి సూర్యకాంతం వర్థంతి సందర్భంగా..) కొందరు నటీనటులు కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా రకరకాల క్యారెక్టర్స్‌ చేసేందుకు ఇష్టపడతారు. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చెయ్యాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే అలా చేస్తే రొటీన్‌ అయిపోతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఒకే తరహా పాత్రను మళ్లీ మళ్లీ చేసి మెప్పించడం సూర్యకాంతం వల్లే సాధ్యమైంది. గయ్యాళి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సూర్యకాంతం.. 200 సినిమాల్లో ఆ పాత్రను పోషించి ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా చెయ్యగలిగారు.   సాధారణంగా సినిమాల్లో గయ్యాళి పాత్ర రాగానే ఆ పాత్ర పట్ల ప్రేక్షకులకు కోపం వస్తుంది. అయితే సూర్యకాంతం చేసే పాత్రలపై వారికి కోపం ఉంటూనే జాలి కూడా కలుగుతుంది. అలా ఆ పాత్రను సూర్యకాంతం తనదైన శైలిలో పోషించి మెప్పించారు. ఆమె చేసిన పాత్రల ప్రభావం ఎంతలా ఉండేదంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టుకోవడం కూడా మానేసే అంతగా. అంతకుముందు సూర్యకాంతం పేరు చాలా మందికి ఉండేది. ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారెవరూ తమ పిల్లలకు ఆ పేరు పెట్టే సాహసం చెయ్యలేదు.    సినిమాల్లో అంత గయ్యాళిగా కనిపించే సూర్యకాంతం ప్రవర్తన నిజజీవితంలో దానికి పూర్తి విరుద్ధంగా ఉండేది. ఎంతో సౌమ్యం, మరెందో దయ, దానగుణంతో అందరికీ ప్రేమను పంచేవారు. అప్పటి హీరోలకు, మిగతా నటీనటులకు సూర్యకాంతం అంటే ఎంతో అభిమానం. ఆమె షూటింగ్‌లో ఉన్నారంటే యూనిట్‌ సభ్యులకు పండగే. ఎందుకంటే.. తను షూటింగ్‌కి వచ్చేటప్పుడు 20 మందికి సరిపడా భోజనాలు, పిండి వంటలు ఆమె వెంట వచ్చేవి. అందరితో కలిసి కూర్చొని ఆమె భోజనం చేసేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు.    సినిమాల ద్వారానే కాకుండా రకరకాల వ్యాపారాలు కూడా చేసి డబ్బు సంపాదించేవారు సూర్యకాంతం. అప్పట్లోనే పాత కార్లను కొని వాటికి మరమ్మతులు చేయించి తిరిగి అమ్మే వ్యాపారం చేసేవారు. నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఎలర్జీ వస్తోందని గ్రహించిన ఆమె.. విదేశాల నుంచి మేకప్‌ కిట్స్‌ తెప్పించి, వాటిని హీరోయిన్లకు అమ్మేవారు. ఇవి కాకుండా ఫైనాన్స్‌ కూడా చేసేవారు. ఎంతో మంది నిర్మాతలు తమ సినిమాల కోసం సూర్యకాంతం దగ్గర ఫైనాన్స్‌ తీసుకునేవారు. ఇక బాపు, రమణ చేసిన సినిమాలన్నింటికీ ఆమే ఫైనాన్సియర్‌. అది కూడా ఎంతో న్యాయబద్ధంగా చేసేవారు. దానికి ఉదాహరణగా ఒక సంఘటనను చెప్పుకోవచ్చు.   ఒక సినిమాకి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ ఆమె దగ్గర కొంత అప్పు తీసుకున్నారు. దాన్ని నెలనెలా చెల్లించేవారు. అలా ఒక నెల తమ మేనేజర్‌తో డబ్బు పంపించారు రమణ. అయితే ఆమె ఆ డబ్బు తీసుకోలేదు. అంతకుముందు నెలతోనే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ అయిపోయాయని చెప్పారు. వడ్డీ ఎక్కువ చెబితే ఆ భయంతో డబ్బు  కరెక్ట్‌గా కడతారని భావించి డబ్బు ఇచ్చే ముందు ఎక్కువ వడ్డీ చెప్పానని, దానికి సాధారణ వడ్డీ మాత్రమే వేశానని అన్నారు. అలా లెక్కేస్తే మిగిలిన డబ్బు చెల్లించక్కర్లేదు అని చెప్పి ఆ డబ్బును వెనక్కి పంపించేశారు సూర్యకాంతం.   తన చివరి శ్వాస వరకూ నటించాలనుకునేవారు సూర్యకాంతం. ఆమె నటించిన చివరి సినిమా 1994లో చిరంజీవి, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ఎస్‌.పి.పరశురాం. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అదే సంవత్సరం డిసెంబర్‌ 18న తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. చెన్నయ్‌లో జరుగుతున్న ఫారిన్‌ డెలిగేట్స్‌తో సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకొని ఆ మీటింగ్‌ను గంటపాటు వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి ఆమెకు నివాళులర్పించి తిరిగి వెళ్లి మీటింగ్‌ను కొనసాగించారు. ఒక నటి కోసం ఎంతో ముఖ్యమైన ఆ మీటింగ్‌ నుంచి ఒక ముఖ్యమంత్రి హడావిడిగా వెళ్ళిపోవడం ఆమె పి.ఎ.కి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించినపుడు ఆమె చెప్పిన సమాధానం విని షాక్‌ అయ్యారు.   ‘షూటింగ్‌లో ఎంతో మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ సూర్యకాంతంగారు. ఆమె పెట్టిన భోజనం ఎన్నోసార్లు తిన్నాను. కొన్నిసార్లు ఆమె ఏ షూటింగ్‌లో ఉందో తెలుసుకొని లంచ్‌ టైమ్‌కి అక్కడికి వెళ్లేదాన్ని. ఆమె వంటలంటే నాకు అంత ఇష్టం. ఆమె చేతి వంట తిన్న విశ్వాసం ఉండాలి కదా. ఈ మీటింగ్‌ కంటే సూర్యకాంతంగారిని కడసారి చూసి నివాళులు అర్పించడమే నాకు ముఖ్యం’ అన్నారు జయలలిత.   ఇదిలా ఉంటే.. సూర్యకాంతం మరణ వార్త తెలిసిన వెంటనే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఆమె నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కానీ, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో నామమాత్రంగా హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వంటి వారు హాజరు కాలేదు. అర్థరాత్రి చనిపోయారు కాబట్టి మరుసటి రోజు అందరూ వస్తారని మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలు జరిపించారు. ఒక మహానటికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.    సూర్యకాంతం చనిపోవడానికి ఆరు నెలల ముందు ప్రముఖ దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. దానిలో చాలా తక్కువ శాతం మంది సూర్యకాంతం చనిపోయినపుడు ఆమెను చూసేందుకు వెళ్లారు. సూర్యకాంతం అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నటీమణి. ఆమె జీవించి ఉన్నప్పుడు ఎంతో మంది ఆమె నుంచి సాయం అందుకున్నారు. మరెంతో మందికి అన్నపూర్ణలా ఆమె అన్నం పెట్టారు. కానీ, ఆమె చనిపోయిన తర్వాత వీడ్కోలు పలికేందుకు మాత్రం మనుషులు కరువయ్యారు. 

Dhurandhar OTT: కళ్ళు చెదిరేలా 'ధురంధర్' ఓటీటీ డీల్.. పుష్ప-2 రికార్డ్ అవుట్!

Publish Date:Dec 18, 2025

  బాలీవుడ్ ఫిల్మ్ 'ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి, ఇప్పటికే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డీల్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   'ధురంధర్' ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.285 కోట్లకు సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది. గతంలో 'ధురంధర్' ఓటీటీ రైట్స్ రూ.130 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.285 కోట్ల డీల్ తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఈ వార్త నిజమైతే.. ఇండియన్ సినీ హిస్టరీలో ఇదే బిగ్ ఓటీటీ డీల్ అవుతుంది. గతంలో 'పుష్ప-2' రైట్స్ ని రూ.275 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డుని 'ధురంధర్' బ్రేక్ చేసినట్లు అయింది. (Dhurandhar OTT)   ఓటీటీ రిలీజ్ విషయానికొస్తే.. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తరువాతే 'ధురంధర్' స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశముంది. జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.   Also Read: తెలుగునాట అవతార్-3 ప్రభావం.. వంద కోట్లు కష్టమేనా..?   కాగా, 'ధురంధర్'కి సీక్వెల్ కూడా ఉంది. రెండో భాగం 2026 మార్చి 19న విడుదల కానుంది. మరి ఈ రెండు భాగాలకు కలిపి ఓటీటీ డీల్ జరిగిందా? లేక ఒక్క భాగానికే రూ.285 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధపడిందా? అనేది తెలియాల్సి ఉంది.  

Bigg Boss 9 Winner Kalyan Padala: బిగ్ బాస్ సీజన్-9 విన్నర్ కళ్యాణ్ పడాల!

Publish Date:Dec 20, 2025

బిగ్ బాస్ సీజన్-9 మొదలై వంద రోజులు పూర్తయింది. నిన్నటి నూట నాలుగవ ఎపిసోడ్ లో సంజన , కళ్యాణ్ పడాల జర్నీ వీడియోలతో ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్ కి అందింది. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అసాధారణ ఆటతీరుతో విశేష ప్రేక్షకాదరణ పొందాడు. నిన్నటి వరకు సాగిన ఓటింగ్ లో కళ్యాణ్ మొదటి స్థానంలో ఉండగా‌‌..తనూజ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు. నాల్గవ స్థానంలో డీమాన్ పవన్ ఉండగా సంజన అయిదో స్థానంలో ఉంది. అయితే కొన్ని ఓటింగ్ పోల్స్ లో  మూడో స్థానంలో డీమాన్ పవన్ ఉన్నాడు. కానీ మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ అంటేనే ట్విస్ట్ లు టర్న్ లు.. అలాంటిది ఏది ముందే చెప్పలేం. కాబట్టి ఆదివారం రాత్రి వరకు సాగే ఈ ఫినాలే కోసం వెయిట్ చేయాల్సిందే. కళ్యాణ్ పడాల ఓ సైనికుడు.. అన్నింటికి మించి సామాన్యుడు. అతడికి హౌస్ లో ఎంట్రీ అయిన నుండే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. అయితే అమ్మాయిలని హగ్ చేసుకుంటాడు అనే రమ్య మోక్ష అన్నప్పుడు కుడా తను అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. డీమాన్ పవన్ , కళ్యాణ్ మధ్య సాగిన ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో.. బ్యాక్ పెయిన్ తో డీమాన్ పడిపోయాడు. అప్పుడు కూడా కళ్యాణ్ గేమ్ ఆడలేదు.. ఎందుకంటే అపోజిట్ లో ఉన్న డీమాన్ పవన్ లేచి ఆడతాడేమోనని వెయిట్ చేశాడు.  ఇది ఒక్కటి చాలు.. ఒక గేమర్ ఎలా ఉండాలో తెలియజేయడానికి. ఇమ్మాన్యుయేల్ తరుపున ఆడినప్పుడు ఓడిపోయాడు దాంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు కళ్యాణ్. ఒక నిజమైన ఎమోషన్ ని కళ్యాణ్ లో ప్రతీ ఒక్క ఆడియన్ చూశాడు. అందుకే అతడికి ఓటింగ్ భారీగా పడింది. తనూజకి కళ్యాణ్ కి మధ్య ఇరవై శాతం ఓటింగ్ తేడా ఉందంటే అతను ఎంతమంది ప్రేక్షకులని గెలిచాడో అర్థం చేసుకోవచ్చు. తనూజ వర్సెస్ కళ్యాణ్ మధ్య సాగిన పోటీలో ఎవరు గెలిచారనేది తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.

The Raja Saab: కామెడీ లేని రాజా సాబ్.. షాకిచ్చిన మారుతీ!

Publish Date:Dec 17, 2025

  రాజా సాబ్ గురించి ఊహించని న్యూస్ కామెడీ తక్కువ.. ఎమోషన్స్ ఎక్కువ మారుతీ మ్యాజిక్ చేస్తాడా?   ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటిస్తున్న మొదటి హారర్ ఫిల్మ్ ఇది.    'రాజా సాబ్' మూవీ హారర్ కామెడీ జానర్ లో రూపొందుతోందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ తో పాటు, ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. దీంతో సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల విందు ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.   అయితే 'రాజా సాబ్' సినిమాలో కామెడీ పెద్దగా ఉండదని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మారుతీ సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. పైగా హారర్ కామెడీ అంటే.. మారుతీ మరింతగా నవ్విస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, 'రాజా సాబ్'లో కామెడీ కంటే ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారట.   Also Read: వారణాసి సెట్స్ కి జేమ్స్ కామెరూన్.. టైగర్ తో షూట్!   'రాజా సాబ్'లో కామెడీ సీన్స్ తక్కువేనట. ప్రభాస్ పాత్ర మాత్రమే సరదాగా ఉంటూ.. వన్ లైనర్స్ తో అక్కడక్కడా నవ్విస్తుందట. సినిమా మొత్తం ఓ ఎమోషనల్ జర్నీలా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కి పెద్ద పీట వేశారట. ఇక పతాక సన్నివేశాలు కంటతడి పెట్టించడం ఖాయమని చెబుతున్నారు.   మారుతీ ఎమోషనల్ ఫిల్మ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకాలం కామెడీ తన బలం అని నిరూపించుకున్న మారుతీ.. ఇప్పుడు ఎమోషన్స్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇందులో ఎమోషన్స్ వర్కౌట్ అయితే మాత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్ 'రాజా సాబ్' చూడటానికి క్యూ కడతారు అనడంలో సందేహం లేదు.  

Is Suriya's Karuppu looking to compete with Dhurandhar 2?

Publish Date:Dec 20, 2025

Suriya starrer Karuppu being directed by RJ Balaji has been struggling with financial issues even though movie is 95% complete. A song and few scenes needs to be shot and the makers are planning to complete the shoot in January. Now, the makers are planning to release on 19th March 2026.  Already, the movie has been facing huge troubles with low asking price from OTT platforms which makers are not happy with. Suriya has been facing huge downtime in his career, so he is expecting Karuppu to be his major comeback at the box office. Meanwhile, he moved on to his next Suriya46 with Venky Atluri.  Sithara Entertainments is producing the film and Mamitha Baiju is playing a leading role in it. The makers have wrapped up shoot completely and they have started post-production works locking May date. Hence, Karuppu cannot go for a further date than Atluri's film.  Meanwhile, Jithu Madhavan's cop film with Suriya will complete shoot by May and the actor, who is producing it himself, doesn't want to take it to 2027, unless works are pending or slowed down it seems.   So, Karuppu makers need to lock March date and so, despite competition with Dhurandhar and Yash's Toxic, they might for the date, say sources. With Dhurandhar being such a massive hit, Part-2 will shatter all box office records in opening weekend for sure. Going against it would be a suicide but makers have no choice, it seems. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969