English | Telugu

సింగిల్ మూవీ ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్స్!..విజయవాడ రచ్చ రచ్చ 

కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ శ్రీవిష్ణు(Sri Vishnu)హీరోగా గీతా ఆర్ట్స్ సమర్పణలో అల్లు అరవింద్(Allu Aravind)నిర్మించిన చిత్రం 'సింగిల్'(Single). కేతిక శర్మ(Kethika Sharma)ఇవానా(Ivana)హీరోయిన్లుగా చెయ్యగా, మే 9 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. తొలి షో నుంచే హిట్ టాక్ ని తెచ్చుకుని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా విజయాపదాన దూసుకుపోతుంది.

దీంతో వరల్డ్ వైడ్ గా సింగిల్ మూవీ ఫస్ట్ వీక్ కి 25 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కలెక్షన్స్ మరింత పెరిగి శ్రీ విష్ణు కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీగా 'సింగిల్' నిలవబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక చిత్ర యూనిట్ మూవీని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్తు విజయయాత్ర చేస్తుంది. అందులో భాగంగా రీసెంట్ గా విజయవాడ వెళ్లిన చిత్ర బృందం సినిమాల్లోని సీన్స్ ని లైవ్ లో ప్రేక్షకులతో పంచుకుంటు వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయయాత్రలో శ్రీవిష్ణు, కేతికరశర్మ, ఇవానా,తో పాటు ప్రధాన పాత్ర పోషించిన వెన్నెల కిషోర్ పాల్గొన్నారు .

రాజేంద్రప్రసాద్, వి టి వి గణేష్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో కనపడగా విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భానుప్రతాప కూడా అరవింద్ తో పాటు నిర్మాతలుగా వ్యవహరించగా కార్తీక్ రాజు(caarthick Raju)దర్శకత్వం వహించాడు.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.