English | Telugu

బాలీవుడ్ కి వెళ్ళిపోతున్న ఎన్టీఆర్..!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫోకస్ బాలీవుడ్ మీదకి షిఫ్ట్ అయిందా? అయితే పాన్ ఇండియా మూవీ లేదంటే హిందీ సినిమా చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడా? ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాటలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది.

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న 'వార్-2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే.. ఎన్టీఆర్ కోసం పలు హిందీ ప్రాజెక్ట్ లు క్యూ కట్టినట్లు తెలుస్తోంది.

యశ్ రాజ్ ఫిలిమ్స్ లో కేవలం 'వార్-2'నే కాకుండా.. పలు ప్రాజెక్ట్ లు చేసేలా లాంగ్ టర్మ్ డీల్ కుదుర్చుకున్నాడట ఎన్టీఆర్. ఇందులో భాగంగా ఒక సోలో ఫిల్మ్ చేయడంతో పాటు, స్పై యూనివర్స్ నుంచి వచ్చే ఇతర సినిమాల్లో భాగం కానున్నాడట.

ఇక భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్ గా రూపొందనున్న 'మేడ్‌ ఇన్‌ ఇండియా'లో ఎన్టీఆర్ నటించే అవకాశముంది. రాజమౌళి సమర్పణలో వరుణ్‌ గుప్తా, ఎస్‌.ఎస్‌.కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి, ఇతర భాషల్లో విడుదల చేయనున్నారని అంటున్నారు.

అంతేకాదు, కరణ్ జోహార్ తో పాటు పలువురు నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఈ లెక్కన ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.

ఎన్టీఆర్ తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఆ తర్వాత 'దేవర-2'తో పాటు, నెల్సన్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. ఒకవేళ వార్-2 తర్వాత ఎన్టీఆర్ చేయబోయే హిందీ ప్రాజెక్ట్ ఏదైనా ఫైనల్ అయితే.. ఈ సినిమాల ఆర్డర్ మారే అవకాశముంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.