English | Telugu

Marana Mass Review: మరణ మాస్ రివ్యూ

మూవీ: మరణ మాస్
నటీనటులు: బాసిల్ జోసెఫ్, అనిష్మా అనిల్ కుమార్, సైజు సన్నీ, బాబు ఆంటోని, రాజేశ్ మాధవన్ తదితరులు
ఎడిటింగ్: చమన్ చాకో
సినిమాటోగ్రఫీ: నీరజ్ రవి
మ్యూజిక్: జేకే
నిర్మాతలు: టొవినో థామస్
దర్శకత్వం: శివప్రసాద్
ఓటీటీ: సోనిలివ్

కథ:

కేరళలోని ఓ గ్రామంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. చీకటిపడితే చాలు, బయటికి రావడానికి జనాలు భయపడుతూ ఉంటారు. కిల్లర్ హత్య చేసిన అనంతరం శవాల నోట్లో 'అరటిపండు' పెడుతూ ఉంటాడు. దాంతో అందరూ అతనిని 'బనానా కిల్లర్' అని పిలుచుకుంటూ ఉంటారు. అదే గ్రామానికి చెందిన ల్యూక్ (బాసిల్) జెస్సీ (అనీష్మా)ని లవ్ చేస్తూ ఉంటాడు. ల్యూక్ లుక్ .. స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉండటంతో, అతనే కిల్లర్ అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. బనానా కిల్లర్' కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ (ఆంటోని) రంగంలోకి దిగుతాడు. ఒకరోజు జెస్సీ కోసం ల్యూక్ బస్సు ఎక్కుతాడు. అదే బస్ లో కొంతమంది జాయిన్ అవుతారు. అసలు సైకో కిల్లర్ ఎవరు? ల్యూక్, జెస్సీ మళ్ళీ కలుస్తారా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

సినిమా పేరు 'మరణ మాస్'. డార్క్ కామెడీ అని చెప్పారు కానీ మాస్ కామెడీ లేదు సినిమా పూర్తిగా చూస్తే మరణమే. జోక్స్ సరిగ్గా పేలలేదు. అటో ఎటో గాల్లోకి ఎగిరిపోయినట్టున్నాయి జోక్స్. అందుకే కథపై పెద్దగా ఆసక్తి ఉండదు.

సైకో కిల్లర్ అనగానే కాస్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. కానీ ఇందులో అదే లోపించింది. డార్క్ కామెడీని దృష్టిలో పెట్టుకున్న దర్శకుడు అసలు మెయిన్ పాయింట్ ని వదిలేశాడు.

సినిమాలో ఏ పాత్రలో అంత బలమైన ఇంపాక్ట్ కనపడదు‌ దానికి తోడు డ్రాగ్ చేసిన స్టోరీ.. ఫస్ట్ అరగంట చూసేసరికే గంట గడిచిన ఫీల్ కలుగుతుంది. ప్రొసీడింగ్స్ అంత దారుణంగా ఉంటాయి మరి. అడల్ట్ సీన్లు లేవు. అశ్లీల పదాలు లేవు. కానీ బాసిల్ పాత్రను ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసి ఉంటే బాగుండేది. అలాగే బస్సు డ్రైవర్, కండక్టర్ పాత్రల వైపు నుంచి కథను టైట్ చేయవలసింది. ఇక పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ పాత్రను కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు. ఆయన కుక్క వైపు నుంచి కూడా కామెడీ ట్రాక్ ను కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. సినిమా మొత్తం ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ఉండాల్సింది పోయి.. నీరసం తెప్పించేలా ఉంటుంది.

నటీనటుల పనితీరు :

ల్యూక్ పాత్రలో బాసిల్ జోసెఫ్, జెస్సీ పాత్రలో అనిష్మా , అజయ్ రామచంద్రన్ పాత్రలో ఆంటోని తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : జస్ట్ ఒకే కామెడీ థ్రిల్లర్ బట్ నాట్ ఎంగేజింగ్.

రేటింగ్: 2.25/ 5

✍️. దాసరి మల్లేష్

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.