English | Telugu

ఓజీ ఎఫెక్ట్.. ఉంటామో పోతామో అర్థం కావట్లేదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న 'ఓజీ' సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌. అనౌన్స్ చేసినప్పటి నుంచి ఓజీ మూవీపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ఒక్కో కంటెంట్.. ఆ అంచనాలను పెంచుతూ వస్తోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతున్న ఓజీ కోసం పవన్ కళ్యాణ్ ఫాన్స్‌తో పాటు.. సినీ సెలబ్రిటీలు సైతం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ క్రేజ్ కి అద్దంపట్టేలా తాజాగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర ట్వీట్ చేశాడు. (They Call Him OG)

"ఓజీ హైప్‌కి హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉంది. సెప్టెంబర్ 25 వరకు మేము ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే, 25 తర్వాత ఏంటో పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్." అంటూ సిద్ధు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓజీ సినిమా కోసం హీరోలే ఇంత ఎక్సైట్ అవుతుంటే.. ఇక ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 రాత్రి నుంచే ప్రీమియర్లు పడనున్నాయి. రేపు(సెప్టెంబర్ 21) ఉదయం ట్రైలర్ విడుదల కానుంది. రేపు సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.