English | Telugu

రాయలసీమలో ఓజి టికెట్ రేట్ ఇంతే.. క్రేజ్ అంటే ఇదేనా!

ఈ నెల 25 వ తేదీన విడుదలవుతున్న 'ఓజి'(OG)పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)రేంజ్ కి తగ్గ చిత్రంగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ని పొందింది. రీలీజ్ కి ఇంకా నాలుగు రోజులే సమయం ఉండటం, ఒక రోజు ముందుగానే బెనిఫిట్ షో లు కూడా ప్రదర్శించడంతో చాలా ఏరియాస్ లో ఇప్పటికే టికెట్స్ కోసం ఫ్యాన్స్ థియేటర్స్ కి పోటెత్తుతున్నారు. పవన్ కట్ అవుట్ లతో కూడా థియేటర్స్ నిండిపోతున్నాయి. దీన్ని బట్టి ఫ్యాన్స్ లో 'ఓజి' కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లోని చిత్తూరుకి చెందిన ఒక అభిమాని 'ఓజి' బెనిఫిట్ షో కి సంబంధించిన తొలి టికెట్ ని లక్షరూపాయలకి కొనుగోలు చేసాడు. ఆ లక్ష రూపాయలని గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా జనసేన పార్టీ ఆఫీస్‌కి పంపించేందుకు థియేటర్‌ యాజమాన్యం రెడీ అవుతుంది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఏరియాకి సంబంధించిన తొలి టికెట్ ని 'ఐదు లక్షల రూపాయలకి ఒక అభిమాని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు భారీ ఎత్తున జరగనుంది. ఏ ఏరియాలో నిర్వహిస్తారనే దానిపై ఈ రోజు సాయంత్రం క్లారిటీ రానుంది. సుమారు 250 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న 'ఓజి' లో పవన్ సరసన ప్రియాంక మోహన్(Priyanka Mohan)జత కట్టగా, ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)విలన్ గా చేస్తున్నాడు. దానయ్య నిర్మాత కాగా సుజీత్(Sujeeth)దర్శకుడు.



అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.