English | Telugu
'ఐ' రికార్డ్ లు మొదలయ్యాయి
Updated : Jan 13, 2015
విదేశాల్లో ఓ రీజనల్ మూవీ మహా అయితే ఓ 100 థియేటర్లలో రిలీజవుతుంది. కానీ శంకర్, విక్రమ్ ల ఐ సినిమా మాత్రం ఏకంగా 450 థియేటర్లలో విడుదల కాబోతోందట. ప్రపంచ వ్యాప్తంగా ఐ సినిమా జనవరి 14న విడుదల కానుంది. అమెరికాలో ఈ సినిమా 450 థియేటర్లలో రిలీజవుతూ రికార్డ్ లు సృష్టిస్తోంది. ఐ ఆడియో వేడుకకు ష్వార్జ్ నెగ్గర్ వంటి హాలీవుడ్ స్టార్ ముఖ్య అతిథిగా రావడంతో ఈ సినిమాపై హాలీవుడ్ కూడా ఆసక్తిగా ఉందట. అందువల్లే ఇన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారని ఫిలింనగర్ న్యూస్. ఐ ఫలితం ఎలా ఉన్నప్పటికీ, భారతీయ సినీ చరిత్రలో ఓ ప్రత్యేక చిత్రంగా మాత్రం మిగిలిపోవడం ఖాయమంటున్నారు సినీ పండితులు.