English | Telugu
వీబీ రాజేంద్రప్రసాద్ మృతికి చలనచిత్ర పరిశ్రమ సంతాపం
Updated : Jan 13, 2015
ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ సంతాపం ప్రకటించింది. సినీ ప్రముఖులు ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. నటుడు వెంకటేష్, మోహన్‌బాబు, నిర్మాత సురేష్‌బాబు, ఎంపీ మురళీమోహన్, నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రమేష్‌ప్రసాద్, బండ్ల గణేష్, డైరెక్టర్ రాఘవేంద్ర, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రాజేంద్రప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.