English | Telugu
విషమంగా సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం!
Updated : Apr 22, 2023
సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల తీవ్ర అస్వస్థకు గురైన ఆయనను మొదట కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కాస్త కుదుటపడిన ఆరోగ్యం, మళ్ళీ విషమించడంతో వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ఆరోగ్యం మెరుగుపడిందని మొదట వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలిసింది. కిడ్నీలు, ఊపితిత్తులు, కాలేయం అవయవాల పనితీరు సరిగా లేదని సమాచారం.