English | Telugu

ఫోన్, పర్సు పోగొట్టుకున్న 'విరూపాక్ష' దర్శకనిర్మాతలు!

ఫోన్, పర్సు పోగొట్టుకున్న 'విరూపాక్ష' దర్శకనిర్మాతలు!

తమ సినిమాకి హిట్ టాక్ వచ్చిందన్న ఆనందంలో ప్రేక్షకుల స్పందన చూద్దామని థియేటర్ దగ్గరకు వెళ్లిన 'విరూపాక్ష' దర్శకనిర్మాతలకు ఊహించని అనుభవం ఎదురైంది. డైరెక్టర్ ఫోన్, ప్రొడ్యూసర్ పర్సు ఎవరో కొట్టేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బాపినీడు.బి సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మొదటిరోజే రూ.6 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో తమ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలని దర్శకుడు కార్తీక్, నిర్మాత బాపినీడు థియేటర్ కి వెళ్లగా.. అక్కడెవరో వారి ఫోన్, పర్సు కొట్టేశారట. ఫోన్, పర్సు పోతే పోయాయిలే.. సినిమా హిట్ అయ్యి కలెక్షన్స్ వస్తున్నాయిగా అని నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.