English | Telugu

30 ఏళ్ళ మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు

తెలుగువారిని విశేషంగా అల‌రించిన కుటుంబ క‌థా చిత్రాల్లో సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు ముందువ‌రుస‌లో ఉంటుంది. సీతారామ‌య్య‌గా మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన ఈ సినిమాలో మ‌న‌వరాలు సీత‌గా టైటిల్ రోల్ లో మీనా అభిన‌యించారు.

ర‌చ‌యిత్రి మాన‌స క‌లం నుంచి జాలువారిన‌ న‌వ్వినా క‌న్నీళ్ళే న‌వ‌ల ఆధారంగా సీతారామ‌య్య గారి మ‌న‌వరాలు చిత్రాన్ని రూపొందించారు ద‌ర్శ‌కుడు క్రాంతి కుమార్. వి.ఎం.సి. ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై వి. దొర‌స్వామిరాజు నిర్మించిన ఈ చిత్రంలో రోహిణి హ‌ట్టంగ‌డి, దాస‌రి నారాయ‌ణ రావు, ముర‌ళీ మోహ‌న్, కోట శ్రీ‌నివాస‌రావు, సుధాక‌ర్, క‌మ‌ల్, త‌నికెళ్ళ భ‌ర‌ణి, రాజా, తెలంగాణ శకుంత‌ల‌, సుధా రాణి, మాస్ట‌ర్ అమిత్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

దిగ్గ‌జ గీత‌ర‌చ‌యిత వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి సాహిత్య‌మందించ‌గా.. స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు అందించారు. ఇందులోని పాట‌ల‌న్నీ అప్ప‌ట్లో విశేష ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. మ‌రీ ముఖ్యంగా.. పూసింది పూసింది పున్నాగ గీత‌మైతే ఇప్ప‌టికీ ఎక్క‌డో చోట వినిపిస్తూనే ఉంటుంది.

ఉత్త‌మ ద్వితీయ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ గాయ‌ని విభాగాల్లో నంది పుర‌స్కారాల‌ను అందుకున్న సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు.. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాల‌ను సొంతం చేసుకుంది.

అలాగే మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో రీమేక్ అయింది. 1991 జ‌న‌వ‌రి 11న విడుద‌లై విజ‌యం సాధించిన సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు.. నేటితో 30 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.