English | Telugu
శ్రుతికి రవితేజ మాత్రమే...
Updated : Jan 11, 2021
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నాయికగా అలరించిన వైనం అందాల తార శ్రుతి హాసన్ సొంతం. మరీ ముఖ్యంగా.. తెలుగునాట ఈ అమ్మడు అగ్ర కథానాయికగా వెలుగొందారు. అంతేకాదు.. దక్షిణాదిన కొందరు స్టార్స్ పక్కన ఒకటికి మించి సినిమాలు చేశారు.
కోలీవుడ్ స్టార్ సూర్య తో ఏళావు అరివు (సెవెన్త్ సెన్స్), ఎస్ 3 (యముడు సిరీస్ లో మూడో చిత్రం) సినిమాలు చేసిన శ్రుతికి.. రెండు సార్లూ మిశ్రమ స్పందనే లభించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలిసారిగా నటించిన గబ్బర్ సింగ్ సెన్సేషనల్ హిట్ కాగా.. సెకండ్ కాంబినేషన్ మూవీ కాటమ రాయుడు నిరాశపరిచింది.
ఇక మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన రెండు సార్లూ ఈ ముద్దుగుమ్మకి విజయాలే దక్కాయి. 2013లో వచ్చిన బలుపు కోసం రవితేజతో ఫస్ట్ టైమ్ జట్టుకట్టి హిట్టు కొట్టింది శ్రుతి. కట్ చేస్తే.. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత రీసెంట్ బ్లాక్ బస్టర్ క్రాక్ కోసం రవితేజతో ఆడిపాడింది. మొత్తమ్మీద.. రవితేజ మాత్రమే శ్రుతికి కలసి నటించిన రెండు సందర్భాల్లోనూ విజయాన్ని అందించినట్లయ్యింది.