English | Telugu

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌ మూవీ రివ్యూ

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఓ మానియా... ఓ పిచ్చి.. ఓ ప్ర‌భంజ‌నం. ప‌వ‌న్ సినిమా అంటే చాలు... క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తుంటారు అభిమానులు. రికార్డులు బ‌ద్ద‌లు కావాల‌ని ఆశ ప‌డుతుంటారు. ఆ అంచ‌నాలు ఎప్పుడూ ఉండేవే అయినా.. స‌ర్దార్ - గ‌బ్బ‌ర్ సింగ్‌కి వ‌చ్చేస‌రికి మ‌రింత ఎక్కువ‌య్యాయి. స‌ర్దార్ టీమ్ కూడా... త‌మ సినిమాకి వీలైనంత హైప్ తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నించారు. బాహుబ‌లి త‌ర‌వాత‌.. అంత క్రేజ్ సొంతం చేసుకొన్న ప్రాజెక్టుగా స‌ర్దార్ నిల‌బ‌డింది. క్రేజ్ స‌రే... మ‌రి సినిమా ఎలా ఉంది?? ప‌వ‌న్ అంచ‌నాల్ని అందుకొన్నాడా? అభిమానుల్ని అల‌రించాడా?? స‌ర్దార్ అనుకొన్న ల‌క్ష్యాన్ని సాధించాడా?? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లిపోవాల్సిందే.

ర‌త‌న్ పూర్ లో.. భైర‌వ్ సింగ్ (శ‌ర‌త్ కేల్క‌ర్‌) అరాచ‌కాలు సృష్టిస్తుంటాడు. అక్క‌డ వ్య‌వ‌సాయ భూముల్ని త‌న మైనింగ్ కోసం నాశ‌నం చేస్తాడు. ఆ ఊరికి బ‌దిలై వ‌స్తాడు సీఐ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ (ప‌వ‌న్ క‌ల్యాణ్‌). కొత్త‌లో అక్క‌డి స‌మ‌స్య‌ల్ని ఏమాత్రం ప‌ట్టించుకోడు. త‌న ఆట పాట‌ల‌తో కాల‌క్షేపం చేస్తాడు. మెల్ల‌మెల్లగా భైర‌వ్ సింగ్ ని ఎదుర్కొని... ర‌త‌న్ పూర్ ప‌రిస్థితుల్ని చ‌క్క‌బెడుతుంటాడు. ర‌త‌న్ పూర్ సంస్థాన‌పు రాజ‌కుమారి ఆర్షి (కాజ‌ల్‌). ఆమెను ఆ సంస్థాన‌పు చెలిక‌త్తె అనుకొంటాడు గ‌బ్బ‌ర్‌సింగ్‌. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. భైర‌వ్ సింగ్‌కీ... ర‌త‌న్‌పూర్ సంస్థాన‌పు రాజుల‌కూ పాత గొడ‌వ‌లు ఉంటాయి. ఆ ప‌గ‌తో.. ర‌త‌న్‌పూర్ సంస్థానాన్ని నాశ‌నం చేయాల‌నుకొంటాడు. ఓ సంద‌ర్భంలో ఆర్షిని చూసి మ‌న‌సు పారేసుకొంటాడు. తన రెండో భార్య‌గా ఆర్షిని చేజిక్కించుకోవాల‌నుకొంటాడు. భైర‌వ్ సింగ్ ఆగ‌డాల‌ను అడ్డుకొని, ఆర్షికి గ‌బ్బ‌ర్ సింగ్ ఎలా చేరువ‌య్యాడ‌న్న‌దే గ‌బ్బ‌ర్‌సింగ్ క‌థ‌.


ఈ సినిమా నా అభిమానుల‌కు అంకితం అని టైటిల్ కార్డులోనే చెప్పేశాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప‌వ‌న్ కూడా ఈ సినిమాని కేవ‌లం అభిమానుల కోస‌మే తీసిన‌ట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి క‌థ‌, స్ర్కీన్ ప్లే కూడా ప‌వ‌న్ అందించాడు. త‌న అభిమానుల‌కు ఎలాంటి సినిమాలు న‌చ్చుతాయో,.. ప‌వ‌న్‌కి బాగా తెలుసు. వాళ్ల ఆలోచ‌న‌ల‌కు, అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ క‌థ‌నీ, త‌న పాత్ర‌నీ డిజైన్ చేసుకొన్నాడు. క‌థ విష‌యంలో వ‌వ‌న్ ప్ర‌యోగాల‌కు పోలేదు. కొత్తద‌నం జోలికి వెళ్ల‌లేదు. ఫార్ములాకు త‌గ్గ‌ట్టుగానే క‌థ‌ని న‌డిపి.. త‌న అభిమానుల్ని అనుక్ష‌ణం సంతృప్తి ప‌ర‌చ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈ సినిమా తొలి స‌న్నివేశం నుంచీ ప‌వ‌న్ మోటీవ్ అదే. ప‌వ‌న్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్‌, అక్క‌డ చెప్పిన డైలాగులు, ఆ త‌ర‌వాత వ‌చ్చే పాట‌.. ఇవ‌న్నీ అభిమానుల‌కు న‌చ్చుతాయి. ప‌వ‌న్ కామెడీ టైమింగ్‌తో.. త‌న ఎన‌ర్జీతో ఫ‌స్టాఫ్ అంతా లాగించేశాడు. ఇంట్ర‌వెల్ ముందొచ్చే...ఫైట్ అభిమానుల‌కు పండ‌గే. ఆడెవ‌డ‌న్నా.. ఈడెవ‌డ‌న్నా.. స‌ర్దార్ అన్న‌కు ఎదురెవ‌డ‌న్నా.. అనే పాట‌తో.. ఓ ఫైట్ కంపోజ్ చేసి.. ఫ‌స్టాఫ్‌కి గ్రాండ్ గా ముగింపు ఇచ్చాడు. సెకండాఫ్‌లో విల‌న్‌ని ఎదుర్కోవ‌డం, హీరోయిన్‌ని దక్కించుకోవ‌డం.. శుభం కార్డు ప‌డిపోవ‌డం.. ఇదంతా రొటీనే. అయితే.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌వ‌న్ శైలి చ‌మ‌క్కులు, డైలాగులు, చిరంజీవి వీణ స్టెప్పు.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి కాల‌క్షేపం అందిస్తాయి.

ప‌వ‌న్ ఎనర్జీ, అత‌ని క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాకి వెన్నెముక‌. ఒక ముక్క‌లో చెప్పాలంటే ఇది ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో. ప‌వ‌న్ లేక‌పోతే ఈ సినిమా లేదు. ప‌వ‌న్ ప్లేసులో మ‌రొక‌రున్నా. ఈ సినిమా అంతంత మాత్ర‌మే. ప‌వ‌న్ పాత్ర త‌ప్ప‌.. రెండో పాత్రేదీ కంటికి క‌నిపించ‌దు. ఏ పాత్ర‌నీ బ‌లంగా రాసుకోలేదు. కొన్ని సీన్లు పైపైన తేలిపోతుంటాయి. క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డంతో ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులు క‌రువ‌వ్వ‌డంతో.. ఉత్కంఠ‌త‌కు లోనుకాలేడు ప్రేక్ష‌కుడు. కానీ.. ప్ర‌తీ సీనులోనూ ప‌వ‌న్ క‌నిపించ‌డం, యాక్ష‌న్ దృశ్యాలు ఆక‌ట్టుకోవ‌డం.. ప‌వ‌న్ శైలి ఎంట‌ర్‌టైన్‌మెంట్ దొర‌క‌డం ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్లు. ప‌తాక స‌న్నివేశాలు సుదీర్ఘంగా సాగుతాయి. పైగా.. తేలిపోయాయి. అంత్యాక్ష‌రి ఎపిసోడ్‌ని ఈ సినిమాలోనూ కంటిన్యూ చేశారు. కాక‌పోతే... గ‌బ్బ‌ర్‌సింగ్ లో పాట‌లు పాడిస్తే.. ఇందులో స్టెప్పులు వేయించారు. ఆ సీన్లు కూడా అంత‌గా పండ‌లేదు. ప‌వ‌న్ వీణ స్టెప్పు వేయ‌డం మాత్రం అభిమానుల‌కు బాగా న‌చ్చుతుంది.

ప‌వ‌న్ ఈ సినిమాలో చాలా అందంగా క‌నిపించాడు. త‌న అభిమానుల్ని మెప్పించాల‌న్న క‌సితో క‌నిపించాడు. ఆ విష‌యంలో ప‌వ‌న్‌ని వంద‌కి వంద మార్కులు ప‌డ‌తాయి. కాస్త ఇబ్బంది ప‌డినా.. స్టెప్పులు వేయ‌డానికి ప్రయ‌త్నించాడు. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ముందు చెప్పిన డైలాగులు ఆక‌ట్టుకొంటాయి. కాజ‌ల్ మేక‌ప్ ఈ సినిమాలో మ‌రీ ఘోరంగా ఉంది. యువ‌రాణిగా అస్స‌లు సూట్ కాలేదు. కొన్ని సీన్ల‌లో కాజ‌ల్‌ని చూడ‌లేక‌పోయామంటే న‌మ్మండి. శ‌ర‌త్ కేల్క‌ర్ పాత్ర‌ని మ‌రింత బ‌లంగా తీర్చిదిద్దాల్సింది. బ్ర‌హ్మానందం కామెడీ మ‌రోసారి వర్క‌వుట్ కాలేదు. సాంబ‌.. అలీ న‌వ్వించ‌లేక‌పోయాడు. ప‌వ‌న్ చుట్టూ ఉన్న పాత్ర‌లో ఏదీ బ‌లంగా లేదు. ఒక్క ప‌వ‌న్ పాత్ర త‌ప్ప‌!

దేవిశ్రీ పాట‌లు సూప‌ర్బ్‌గా అనిపిస్తాయి. ఆర్‌.ఆర్ విష‌యంలోనూ క‌ష్ట‌ప‌డ్డాడు. అయితే సన్నివేశాల్లోనే ఆ బ‌లం త‌గ్గింది. బుర్రా సాయిమాధ‌వ్ సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డ మెరుస్తాయి. గెలవ‌డానికి వ‌చ్చిన‌వాళ్లంతా రాజులు కారు, గెలిచిన‌వాళ్లే రాజులు ఆన్న డైలాగు బాగుంది. ప‌వ‌న్ పొలిటిక‌ల్ కెరీర్‌ని అన్వ‌యించుకొంటూ రాసిన మాట‌లూ బాగానే పేలాయి. కెమెరా వ‌ర్క్ అదిరిపోయింది. ర‌త‌న్ పూర్ సెట్ అని హ‌డావుడి చేశారు గానీ.. అంత లేద‌క్క‌డ‌. బాబి ప‌వ‌న్ క‌ల్యాణ్ అడుగుజాడ‌ల్లో న‌డిచాడ‌న్న‌ది అర్థం అవుతోంది. ప్ర‌తీ సీన్‌లోనూ ప‌వ‌న్ ముద్రే క‌నిపిచింది మ‌రి.

మొత్తానికి ప‌వ‌న్ అభిమానుల కోసం త‌యారు చేసిన సినిమా ఇది. వాళ్ల‌కు ప‌వ‌న్‌ని ఈ గెట‌ప్పులో చూడ‌డం బాగా న‌చ్చుతుంది. ప‌వ‌న్ అంటే ఇష్ట‌ప‌డేవాళ్లు.. ఈ సినిమాకి నిరంభ్యంత‌రంగా వెళ్లొచ్చు. మరి నాన్ ఫ్యాన్స్ మాటేంటి?? అని మీర‌డ‌గితే.. స‌మాధానం చెప్ప‌డం క‌ష్ట‌మే. ఇంకొన్ని రోజులు ఆగితే బాక్సాఫీసు రిపోర్టే ఆ సంగ‌తి తేల్చేస్తుంది.

రేటింగ్ 2.00

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.