English | Telugu
కరేబియన్ దీవిని కొనేసిన మహేష్ బాబు..!
Updated : Apr 7, 2016
సూపర్ స్టార్ మహేశ్ ..ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. సినిమాలతో పాటు యాడ్స్‌లోనూ నటిస్తూ రియల్ లైఫ్‌లోనూ శ్రీమంతుడిగా మారిపోయాడు. సినిమాకి, డబ్బుకి ఎంత విలువిస్తాడో, అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ను కుటుంబానికి ఇస్తాడు సూపర్ స్టార్. షూటింగ్ లేదంటే ఫ్యామిలీతో గడపడానికే ప్రిఫరెన్స్ ఇస్తాడు. సాధారణంగా మహేష్ లాంటి సెలబ్రిటీలకు ఇండియాలో ప్రైవసీ దొరకదు. అందుకే కుటుంబంతో సహా ఫారిన్ చెక్కేసి, అక్కడే కాస్త హాయిగా రిలాక్స్ అయి వస్తుంటారు. అయితే ఇప్పుడు మహేష్ తనకోసం పూర్తిగా ఒక సొంత ప్లేస్ ను ఫారిన్ లో కొనుక్కుంటున్నారట. కుటుంబంతో సహా ప్రతీ ఏడాదీ వెకేషన్లో గడపడం కోసం, కరీబియన్ ఐలాండ్స్ దగ్గర ఒక ప్రైవేట్ దీవిని కొనుక్కుంటున్నాడట. దాదాపు 12 కోట్లు పెట్టి ఈ దీవిని శ్రీమంతుడు సొంతం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. దీవితో పాటు, అక్కడే అన్ని వసతులూ ఉన్న పెద్ద భవంతి, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ లాంటి అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటాయట. శ్రీమంతుడు తలచుకుంటే సాధించలేనిదేముంటుంది..?