English | Telugu
సలార్ డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాత డబ్బులని వెనక్కి ఇచ్చాడా!
Updated : Mar 12, 2024
గత సంవత్సరం చివర్లో వచ్చిన ప్రభాస్ వన్ మాన్ షో మూవీ సలార్. విడుదలైన అన్ని చోట్ల విజయదుందుభి మోగించింది. చాలా ఏరియాల్లో రికార్డు కలెక్షన్స్ ని కూడా సృష్టించింది. పైగా తెలుగులో హయ్యెస్ట్ గ్రాస్ వసులు చేసిన మూడో మూవీగా కూడా చరిత్ర సృష్టించింది. మరీ ఇంతటి ట్రెండ్ ని క్రియేట్ చేసిన సలార్ గురించి వస్తున్న రూమర్ ప్రస్తుతం చర్చనీయాంశ మయ్యింది.
సలార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో భారీ ఎత్తున విడుదల అయ్యింది. ప్రభాస్ కట్ అవుట్ మీద ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తానికి హక్కులని పొందారు. ఇక్కడే వాళ్ళు లాస్ అవ్వడానికి కారణం అయ్యింది. సలార్ రికార్డు కలెక్షన్స్ ని సృష్టించడం నిజమే. కానీ భారీ అమౌంట్ కి తీసుకోవడం వలన ఏపి లోని కొన్ని ఏరియాల్లో స్వల్ప లాస్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు నిర్మాత విజయ్ సదరు డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ అమౌంట్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. నైజాం లో మాత్రం సలార్ కి మంచి లాభాలు వచ్చాయి
ఇక సలార్ పార్ట్ 2 షూటింగ్ జూన్ లో ప్రారంభం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ ని కంప్లీట్ చేసి వచ్చే ఏడాది కి విడుదల చెయ్యాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయం మీద త్వరలోనే అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ నట విశ్వరూపం పార్ట్ 2 లో ఉండబోతుందని ఫ్యాన్స్ అయితే నమ్మకంతో ఉన్నారు