English | Telugu

రేయ్‌... ఇది మ‌రీ టూమ‌చ్ రా..!

సాయిధ‌ర‌మ్ తేజ్ రేయ్ సినిమాకి ఎట్ట‌కేల‌కు మోక్షం ల‌భించింది. ఈనెల 27న రాబోతోంది. మెగా హీరో సినిమా కాబ‌ట్టి వ‌సూళ్లు బాగానే ఉంటాయ్‌. అంతా ఒకే. కానీ.. ఈ సినిమాకి భారీ న‌ష్టాలు త‌ప్పేట్టు లేవు. సినిమా ఎంత బాగున్నా నిర్మాత‌గా వైవిఎస్ చౌద‌రికి త‌ల‌బొప్పి క‌ట్టే ఛాన్సులు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి రూ.35 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ట‌. సూప‌ర్ స్టార్లూ, మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ లాంటి వాళ్ల సినిమాల‌కే ఇన్ని వ‌సూళ్లు ద‌క్క‌డం లేదు. సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ఈ డ‌బ్బులు తిరిగొస్తాయ‌నే గ్యారెంటీ ఎవ్వ‌రికీ లేదు. కొత్త హీరో అని కూడా చూడ‌కుండా వైవిఎస్ చౌద‌రి ఈ సినిమాకోసం ఎడాపెడా ఖ‌ర్చు పెట్టేశాడు. ఈ సినిమాకి రూ.27 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ట‌. అప్పుల‌కు వ‌డ్డీల‌న్నీ క‌లుపుకొని రూ.35 వ‌ర‌కూ చేరింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకు త‌గిన‌ట్టే ట్రైట‌ర్ రిచ్‌గా ఉంది. ఈ సినిమా ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిపోయినా.. పెట్టుబ‌డి గిట్టుబాటు కావ‌డం క‌ష్టాతి క‌ష్టం. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కి పోయి చౌద‌రి మ‌రీ టూమ‌చ్‌గా ఖ‌ర్చు పెట్టేశారిందులో. లేట్ అయిన సినిమాకు గ్లామ‌ర్ ఉండ‌దు. అందుకే బ‌య్య‌ర్లు కూడా వీలైనంత త‌క్కువ రేటుకు ఈసినిమా కొనేద్దాం అనుకొంటున్నారు. పిల్లా నువ్వు లేని జీవితం హిట్టయినా రూ.15 కోట్లు కూడా రాలేదు. మ‌రి రూ.35 కోట్లు రావ‌డానికి ఈ సినిమా ఇంకెంత పెద్ద హిట్ట‌వ్వాలో..??