English | Telugu
కాజల్ మేకప్ ఘోరం... యువరాణిగా సూట్ కాలేదు
Updated : Apr 8, 2016
సర్ధార్ గబ్బర్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ తర్వాత అందరి కళ్లూ కలువ కళ్ల కాజల్ మీదే వుంటాయనడంలో అతిసయోక్తి ఏమాత్రం లేదు. కాజల్ తొలిసారిగా పవర్ స్టార్‌తో జతకట్టింది. ఇక ఈ చిత్రంలో కాజల్ యువరాణిగా కనిపించింది. దీంతో కామన్‌గానే చూపులు కాజల్ వైపు వెళ్లిపోయాయి. అయితే మూవీలో కాజల్ మేకప్ మరీ ఘోరంగా ఉంది. యువరాణిగా అస్సలు సూట్ కాలేదు. కొన్ని సీన్లలో కాజల్‌ని చూడలేకపోయామంటే నమ్మండి. వయసు మీద పడటం, స్లిమ్‌గా మారడం కోసం భారీ డైటింగ్లు చేయడంతో కాజల్ ఫేస్‌లో ఛార్మింగ్ లేక ముఖం వాడిపోయింది. సినిమా బోర్ కొట్టించినా కనీసం కాజల్ అందాలతో పసందు చేసుకుందామనుకుంటే అభిమానులకు నిరాశే మిగిలింది.