English | Telugu
అమరావతిలో బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి
Updated : Apr 8, 2016
తెలుగు సినీ ప్రపంచంతో పాటు నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నటసింహ బాలకృష్ణ వందో సినిమాపై సస్పెన్స్ విడిపోయింది. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్రతో తన వందో సినిమా తీస్తున్నట్లు బాలకృష్ణ అధికారికంగా ప్రకటించాడు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన సినిమా ప్రకటన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తన వందో సినిమా గురించి అభిమానులు చాలా ఎదురు చూశారని వారందరికి కానుక ఇచ్చేందుకు అమరావతి వచ్చినట్టు తెలిపారు. 100వ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తారని, చరిత్రను మలుపు తిప్పే సినిమాలు తీయాలంటే అది నందమూరి వంశానికి సాధ్యమన్నారు. కార్యక్రమంలో దర్శకుడు క్రిష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరులు హాజరయ్యారు.