English | Telugu

'రుద్ర‌మ‌దేవి' వ‌స్తోందోచ్‌!

ఇదిగో వ‌స్తోంది.. అదిగో వ‌స్తోంది.. అంటూ గ‌త కొన్ని నెల‌లుగా వాయిదాల ప‌ర్వంతో వార్త‌ల్లో నిలిచిన 'రుద్ర‌మ‌దేవి' సినిమా ఎట్ట‌కేల‌కు రెడీ ఫ‌ర్ రిలీజ్ అంటోంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు భారీ వ్య‌యంతో నిర్మించిన ఈ సినిమాలో అనుష్క టైటిల్ రోల్ చేసింది. 'రుద్ర‌మ‌దేవి'ని సంక్రాంతి, స‌మ్మ‌ర్‌.. ఇలా కొన్ని సీజ‌న్ల టైంలో రిలీజ్‌కి ప్లాన్ చేసుకున్న‌ప్ప‌టికీ.. టెక్నీక‌ల్‌, ఫైనాన్షియ‌ల్ రీజ‌న్స్‌తో పోస్ట్‌పోన్ అవుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ నెల 26న 'రుద్ర‌మ‌దేవి' రిలీజ్‌కి బెర్త్ సంపాదించుకుంద‌ని గుణ‌శేఖ‌ర్ అండ్ టీమ్‌ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా సంద‌డి చేయ‌నున్న ఈ సినిమా.. చిత్ర యూనిట్ ప‌డ్డ క‌ష్టాల‌న్నింటిని మ‌రిచిపోయేలా రిజ‌ల్ట్‌ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. అల్లు అర్జున్‌, రానా, నిత్యా మీన‌న్‌, కేథ‌రిన్ ట్రెసా త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన 'రుద్ర‌మ‌దేవి'కి ఇళ‌యరాజా సంగీత‌మందించారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.