English | Telugu

బ‌హుబ‌లీ.. ఏమిటీ క‌క్కుర్తి?!

యూట్యూబ్‌లో బాహుబ‌లి ట్రైల‌ర్ క‌నిపించ‌క‌పోవ‌డం... అభిమానుల్ని షాక్‌కి గురిచేసింది. త‌మ సినిమాపై దిష్టి త‌గిలింద‌ని ఫ్యాన్స్ కాస్త ఓవ‌ర్‌గా ఆలోచించి కంగారు ప‌డుతున్నారు. యూ ట్యూబ్ నిబంధ‌న‌లుకు లోబ‌డి ఈ ట్రైల‌ర్‌ని అప్ లోడ్ చేయ‌లేద‌న్న‌ది ప్రాధ‌మిక స‌మాచారం. అయితే.. ఎక్కువ హిట్స్ కోసం అడ్డదారులు తొక్కినా... యూ ట్యూబ్ లో వీడియోలు క‌నిపించ‌వు. రెండో కార‌ణంతోనే యూ ట్యూబ్ ఆ ట్రైల‌ర్‌ని తొల‌గించింద‌ని ఇంకొంద‌రి వాద‌న‌. తొలి రోజే ప‌ది ల‌క్ష‌ల వ్యూవ్‌పైగానే సాధించి బాహుబ‌లి సంచ‌ల‌నం సృష్టించింది. ఈసినిమాపై ఉన్న హైప్‌ని దృష్టిలో ఉంచుకొంటే ఆ మాత్రం వ్యూవ్స్ గ్యారెంటీగా వ‌స్తాయి. ఎక్క‌డ అనుకొన్న‌న్ని హిట్స్ రావేమో అని బాహుబ‌లి చిత్ర‌బృంద‌మే కావాల‌ని.. అడ్డాదారి తొక్కి హిట్స్ పెంచుకొంద‌ని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే రాజ‌మౌళి & టీమ్ ఎక్క‌డో బాహుబ‌లి విష‌యంలో కాస్త అసంతృప్తికీ, కొన్ని అనుమానాల‌కూ లోన‌వుతున్నార‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ప‌ది ల‌క్ష‌ల హిట్స్ క‌నుక రాక‌పోతే హైప్ ఎక్క‌డ ప‌డిపోతుందో అన్న భ‌యాలూ ఉండొచ్చు. ఇప్ప‌టికే ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయ‌న్న‌ది వాస్త‌వం. దాన్ని త‌గ్గించుకోవ‌డానికి రాజ‌మౌళి ప్ర‌య‌త్నాలు చేయ‌కపోగా, ఇలాంటి ట్రిక్కుల‌తో.. ప్రేక్ష‌కుల‌కు లేనిపోని అనుమానాలు వ‌చ్చేలా చేస్తున్నాడు. బాహుబలి ట్రైల‌ర్ ఎందుకు క‌నిపించ‌డం లేదో, అందుకు సంబంధించిన టెక్నిక‌ల్ విష‌యాలేంటో రాజమౌళే స్వ‌యంగా చెప్పాలి. లేదంటే.. ఈ క‌న్‌ఫ్యూజ‌న్లు మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.