English | Telugu
రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్.. 'తొలిప్రేమ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్!
Updated : Jun 22, 2023
టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ సినిమా సినిమాకి మరోస్థాయికి వెళ్తుంది. ఇటీవల 'సింహాద్రి' రీరిలీజ్ సమయంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించి సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఇక ఇప్పుడు 'తొలిప్రేమ' సినిమా రీరిలీజ్ ట్రైలర్ ఈవెంట్ తో మరో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన 'ఖుషి', 'జల్సా' సినిమాలు రీరిలీజ్ అయ్యి వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు పవన్ నటించిన మరో సినిమా మళ్ళీ థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది. పవన్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఫిల్మ్ 'తొలిప్రేమ'. 1998 జులైలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ప్రేమ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు కట్టిపడేశాయి. పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. అప్పట్లో యూత్ ఈ సినిమాకి ఫిదా అయిపోయారు. కేవలం పవన్ అభిమానులే కాకుండా, అందరూ మెచ్చేలా ఉంటుంది. 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాని మళ్ళీ విడుదల చేస్తున్నారు. జూన్ 30న ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 300 కి పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ట్రైలర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. జూన్ 24 న ఉదయం 10:30 కి ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. 'ఖుషి', 'జల్సా' స్థాయిలో 'తొలిప్రేమ' కూడా రీరిలీజ్ లో మంచి వసూళ్ళు రాబడుతుందేమో చూడాలి.
