English | Telugu
బాలయ్య పేరు చెప్పినా లెక్కలేదా?
Updated : Dec 16, 2014
బాలకృష్ణ సినిమాకో కొత్త సమస్య వచ్చి పడిందీ.. అదీ టైటిల్ రూపంలో. లెజెండ్ తరవాత బాలకృష్ణ ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ఆయనే సత్యదేవ్. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమా కోసం పలుపేర్లు పరిశీలలో ఉన్నాయి. ఇది వరకు గాడ్సే అనుకొన్నారు.. ఆ తరవాత లయన్ వైపు మొగ్గు చూపారు. అయితే ఈటైటిల్ మరో నిర్మాత దగ్గర ఉంది. టైటిల్ రిజిస్టర్ చేయించుకొన్నా, ఆయన సినిమా మొదలెట్టలేదు. బాలయ్య పేరు చెబితే టైటిల్ ఫ్రీగా ఇచ్చేస్తారనుకొంటే, సదరు నిర్మాత టైటిల్ ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పేస్తున్నాడట. బాలయ్య పేరు చెప్పినా దిగి రావడం లేదని చిత్రబృందం చెబుతోంది. బాలయ్య మాత్రం లయన్ టైటిలే ఫిక్స్ చేద్దాం అని మెంటల్ గా ఫిక్సయిపోయాడట. మరోవైపు టీజర్ కూడా రెడీ అవుతోంది. జనవరి 1న టీజర్‌ని అభిమానులకు చూపించాలని చిత్రబృందం కసరత్తు చేస్తోంది. ఈలోగా టైటిల్ దక్కుతుందా, లేదా అనే అనుమానాలున్నాయి. టైటిల్ లేకుండా టీజర్ విడుదల చేయడం భావ్యం కాదని చిత్రబృందం ఆలోచిస్తోంది. స్వయంగా బాలయ్యే రంగంలోకి దిగితే తప్ప.. లయన్ టైటిల్ దక్కేట్టు లేదు.