English | Telugu
తన డైరెక్టర్, హీరోయిన్‌తో రామ్ క్లాష్!
Updated : Jan 11, 2021
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ సంక్రాంతికి రెడ్ తో పలకరించబోతున్నారు. తమిళ చిత్రం తాడమ్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా కోసం తొలిసారి ద్విపాత్రాభినయం చేశారీ యంగ్ హీరో. జనవరి 14న ఈ మాస్ థ్రిల్లర్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అదే రోజున రెడ్ తో పాటు మరో చిత్రం బరిలోకి దిగుతోంది. ఆ సినిమానే.. అల్లుడు అదుర్స్. తొలుత ఈ మూవీని జనవరి 15న రిలీజ్ చేయాలనుకున్నారు. ఒక రోజు ముందే వస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. విశేషమేమిటంటే.. ఈ సినిమాలో కథానాయికగా నటించిన నభా నటేష్.. రామ్ ఇస్మార్ట్ శంకర్ లో మెయిన్ లీడ్. ఇక అల్లుడు అదుర్స్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్.. రామ్ కాంబినేషన్ లో కందిరీగ అనే సూపర్ హిట్ మూవీతో పాటు హైపర్ అనే మరో చిత్రం చేశాడు.
మొత్తమ్మీద.. తన డైరెక్టర్, హీరోయిన్ తో రామ్ కి క్లాష్ తప్పడం లేదన్నమాట. మరి.. ఈ పోటీలో ఎవరికి విజయం దక్కుతుందో చూడాలి.