English | Telugu

జీవితానికి గ్యారంటీ లేదు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు

స్టార్ హీరోలు నాగార్జున(Nagarjuna)ధనుష్(Dhanush)కలిసి చేసిన పాన్ ఇండియా మూవీ 'కుబేర'(Kuberaa). సౌత్ ఇండియాలో తెరకెక్కిన మరో అతి పెద్ద మల్టిస్టారర్ మూవీగా, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పుష్ప 2 , యానిమల్ వంటి పాన్ ఇండియా చిత్రాలతో వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన నేషనల్ క్రష్ 'రష్మిక'(Rashmika Mandanna)హీరోయిన్. దీంతో 'కుబేర' కి పాన్ ఇండియా లెవల్లో సరికొత్త క్రేజ్ వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి 'హైదరాబాద్'(Hyderabad)లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా అభిమానులని ఉద్దేశించి రష్మిక మాట్లాడుతు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంతో నాకు చాలా భయమేస్తుంది. ఈ మధ్య నేను ఎక్కువగా విమానాల్లోనే జర్నీ చేస్తున్నాను. దాంతో ఏ నిమిషం ఏం జరుగుతుందో అనే భయం పట్టుకుంది. మన జీవితాలకి గ్యారంటీ లేదనే విషయం కూడా అర్ధమయ్యింది. ఫంక్షన్ తర్వాత మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్లండని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కన్నడ సినీ రంగానికి చెందిన రష్మిక 2016 లో' కిరాక్ పార్టీ' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కన్నడంలోనే అంజనీ పుత్ర, చమక్ అనే చిత్రాల్లో నటించి, 2018 లో 'నాగ శౌర్య' హీరోగా వచ్చిన 'ఛలో' మూవీతో తెలుగు నాట అడుగుపెట్టింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప పార్ట్ 1 , పార్ట్ 2 , సీతారామం, వారిసు, యానిమల్, చావా వంటి చిత్రాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. దీంతో' కుబేర' పై అందరిలో అంచనాలు పెరిగాయి. క్రైమ్ డ్రామా జోనర్ లో తెరకెక్కిన కుబేర కి 'శేఖర్ కమ్ముల'(Sekhar Kammula)దర్శకుడు. సునీల్ నారంగ్(Suniel Narang),పి రామ్మోహనరావు(p.Ram Mohan Rao)తో కలిసి శేఖర్ కమ్ముల నే నిర్మించాడు. ఈ నెల 20 న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.