English | Telugu
ప్రభాస్ పెళ్లి...రానా ఓపెన్ ఆఫర్
Updated : Jan 22, 2016
రాజకుమారుడు, ఆరు అడుగుల రెండంగుళాల అందగాడు, అవసరమైతే ఇంట్లో పనులకు సాయపడతాడు, అమ్మాయి కోసం కొండలెక్కుతాడు...మేకప్ కూడా చేస్తాడు..ఏంటి ఇదంతా అనుకుంటున్నారా...వాంటెడ్ బ్రైడ్ ఫర్ బాహుబలి అంటూ ట్విట్టర్ లో రానా ఇచ్చిన ప్రకటన ఇది.. ప్రభాస్ రానాలిద్దరికీ మధ్య చాలా చనువుంది..బావా బావా అని పిలుచుకునేంత క్లోజ్ వీళ్లిద్దరూ. అందుకేనేమో, ట్విట్టర్లో ప్రభాస్ ను సరదాగా ఆటపట్టించాడు రానా...36 ఏళ్ల మా అందగాడికి వధువు కావలెను అంటూ ప్రకటన ఇచ్చాడు..
వధువుకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో కూడా ముందే చెప్పాడు..అమ్మాయికి అందంతో పాటు, అడవుల్లో, మంచు తుఫాన్లో కూడా ప్రయాణించడం తెలిసుండాలి.. కత్తి యుద్ధం, మల్లయుద్ధం తెలిసుండాలట..ఇప్పటికే చాలా ఏళ్లు కారాగారంలో ఉన్న అత్తగారిని బాగా గౌరవించాలట..ఇంటిపనిలోనూ,శత్రువుల్ని ఓడించడంలోనూ భర్తకు సాయపడాలట...ఫైనల్ పంచ్ గా క్వాలిఫికేషన్స్ ఉన్న అమ్మాయిలు, అడ్మిన్ కట్టప్పకు గానీ, శివగామికి గానీ తమ డిటెయిల్స్ మెయిల్ చేయాలని మెయిల్ ఐడీలు ఇచ్చాడు..ప్రభాస్ కావాలనుకునే అమ్మాయిలందరూ ఇప్పుడు ఇన్ని విద్యలు నేర్చుకోవాలేమో...