English | Telugu
త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చిన అనిరుధ్
Updated : Jan 22, 2016
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అ - ఆ..వై దిస్ కొలవెరి సాంగ్ తో వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ ను భారీ రెమ్యునరేషన్ తో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు..ఏమైందో ఏమో కానీ..ఇప్పటికే 70 శాతం పూర్తయిన ఈ సినిమా నుంచి అనిరుధ్ సడెన్ గా తప్పుకున్నాడు..దాంతో ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ ను గానీ,మిక్కీ జే మేయర్ ను గానీ తీసుకునే ఆలోచనలో మూవీ టీం ఉన్నారట..ఇప్పటికే తనకు జల్సా,జులాయి,అత్తారింటికి దారేది లాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవీ వైపే త్రివిక్రమ్ మొగ్గు చూపే అవకాశం ఉంది..
ఇంతకూ ' అ ఆ' అంటే, అనసూయ రామలింగ్ వర్సెస్ ఆనంద్ విహారి.ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నితిన్ సరసన సమంత,అనుపమ పరమేశ్వరన్ లు జోడీ కడుతున్నారు..ప్రస్తుతం హైదరాబాద్ లో ' అ..ఆ ' జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది..ఇలాంటి సమయంలో,మూవీకి కీలకమైన సంగీత దర్శకుడు తప్పుకోవడం,సినిమా రిలీజ్ ను ఎంతో కొంత ఆలస్యం చేస్తుందంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు..