English | Telugu
సెకండ్ సినిమాకే మహేష్ తో ఛాన్స్...
Updated : Jan 22, 2016
నేను శైలజ తో ,తెలుగులో ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన తమిళ భామ కీర్తి సురేష్ కు ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తగిలింది..మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ చేయబోతున్న సినిమాకు హీరోయిన్ గా కీర్తి ఛాన్స్ కొట్టేసింది...ముందు ఈ పాత్రకు మురుగదాస్ టీం బాలీవుడ్ భామల్ని పరిశీలించినా,చివరికి వారి అన్వేషణ సౌత్ లో ఆగింది...మహేష్ పక్కన కీర్తి సురేశ్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు..ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ తో వర్క్ తో పాటు,హారిస్ జైరాజ్ అందిస్తున్న స్వరాలను కూడామురుగదాస్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడట..
ఒకేసారి తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ భారీ మూవీని ఠాగూర్ మధు-ఎన్ వి ప్రసాద్ లు నిర్మిస్తున్నారు..గతంలోనే చాలా సార్లు మురుగదాస్ - మహేష్ సినిమా పట్టాలెక్కాల్సి వచ్చినా,ఏ కారణం వల్లో వర్కవుట్ కాలేదు..మరి భారీ అంచనాలు ఉన్న వీరి కాంబినేషన్ ఎంత మేరకు వాటిని అందుకుంటుందో చూడాల్సిందే.